బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యేందుకు సమయం దగ్గర పడడమేకాదు, అందుకు తగినట్టుగా బిగ్ బాస్ యాజమాన్యం క్రేజ్ పెంచేందుకు ప్రోమోస్ వదులుతుంది. హోస్ట్ నాగార్జున అప్పుడే రెండు ప్రోమోస్ తో సీజన్ 9 కోసం తన డ్యూటీ స్టార్ట్ చేసేసారు. ఈ సీజన్ లో ఆసక్తికరంగా కనిపిస్తుంది కామన్ మ్యాన్ ఎంట్రీ.
కామన్ మ్యాన్ సీజన్9 హౌస్ లోకి వెళ్లేందుకు బిగ్ బిగ్ బాస్ యాజమాన్యం క్రేజీ ఆఫర్ ఇచ్చింది. దానితో చాలామంది బిగ్ బాస్ కి వెళ్లేందుకు తెగ ఉత్సాహం చూపించేస్తున్నారు. అందుకే బిగ్ బాస్9 లోకి అడుగుపెట్టేందుకు వేలాదిగా యాజమాన్యానికి అప్లికేషన్స్ పెడుతున్నారంటే వారు ఎంత క్రేజీగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
మరి సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్, యూట్యూబర్స్ నడుమ కామన్ మ్యాన్ ఎలా సర్వైవ్ అవుతాడో అనేది బిగ్ బాస్ సీజన్ 9 చూసి తెలుసుకోవాల్సిందే. గత సీజన్స్ చూసాక కామన్ మ్యాన్స్ ని కూడా తక్కువగా అంచనా వెయ్యొద్దు మావా అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.