Advertisement
Google Ads BL

నితిన్ కోలుకునేదెలా..


హీరో నితిన్ కి భీష్మ తర్వాత ఆ రేంజ్ హిట్ రావడమే లేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది. చెక్‌, మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం, ఎక్స్ ట్రా, రాబిన్ హుడ్ ఇలా ప్రతి సినిమా ప్లాపే. వరస డిజాస్టర్స్ నితిన్ కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టేశాయి. రాబిన్ హుడ్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా అది షాకిచ్చింది. తమ్ముడు విషయంలో నితిన్ లైట్ గానే ఉన్నాడు. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ టైటిల్ తమ్ముడు పెట్టుకున్నాడు, కనీసం పవన్ టైటిల్ కూడా నితిన్ ని ఆదుకోలేకపోయింది. నిన్న శుక్రవారం విడుదలైన తమ్ముడు చిత్రానికి క్రిటిక్స్, ఆడియన్స్ ఓవరాల్ గా నెగెటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో రెండోరోజుకే తమ్ముడు చేతులెత్తేసింది. నితిన్ పై నమ్మకం లేకనో ఏమో మొదటి రోజు తమ్ముడు ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. 

త‌మ్ముడు అంటూ మాస్ గా కాస్త కొత్తగా నితిన్ ట్రై చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. తమ్ముడు సినిమా రిజల్ట్ తో నితిన్ కెరీర్ ప్రమాదంలో పడింది. తమ్ముడు రిజల్ట్ తర్వాత నిర్మాత దిల్ రాజు నితిన్ ని పెట్టి ఎల్లమ్మ ను తెరకెక్కిస్తారా అనే అనుమానం నితిన్ ఫ్యాన్స్ లోనే స్టార్ట్ అయ్యింది. 

అసలే తమ్ముడు కి నితిన్ రెమ్యునరేషన్ తీసుకోలేదు, లాభాల్లో వాటా అనే కండిషన్ తో తమ్ముడు చేసాడు, లాభాలు కాదు గదా పెట్టిన బడ్జెట్ కూడా రాదు. ఇకపై నితిన్ కెరీర్ ఎలా ఉండబోతుందో, తమ్ముడు తర్వాత నితిన్ ఎలా కోలుకుంటాడో చూడాలి. 

Hero Nithin Career in Crisis:

Thammudu Pubic Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs