సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో భాగ్యం-మీను లతో రొమాన్స్ చేసిన వెంకటేష్ ఆ చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రియురాలిగా, ఐశ్వర్య రాజేష్ భార్యగా ఆయన సరసన నటించారు. ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మరోమారు ఇరువురి భామల కౌగిలిలో వెంకీ నలిగిపోయేందుకు సిద్దమవుతున్నారట.
త్రివిక్రమ్ తో త్వరలోనే వెంకీ ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. వెంకీ-త్రివిక్రమ్ కాంబో మూవీకి వెంకటరమణ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా టాక్ ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ త్రిషతో మరోసారి రొమాన్స్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వెంకీ-త్రిష కలిసి ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే. నమో వెంకటేష లో నటించారు.
త్రిష తో పాటుగా మరో హీరోయిన్ కూడా వెంకటరమణ చిత్రంలో వెంకీ తొ రొమాన్స్ చేస్తుంది అని.. త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం వెంకీ చిత్రంలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది. మరో హీరోయిన్ గా హరి హర వీరమల్లు, రాజా సాబ్ చిత్రాల ఫేమ్ నిధి అగర్వాల్ వెంకీ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్ వినబడుతుంది.
ప్రస్తుతం వెంకీ అమెరికాలో జరుగుతున్న నాటా సభలకు హాజరయ్యారు. అక్కడి నుంచి రాగానే త్రివిక్రమ్ మూవీ సెట్ లోకి వెళతారని, ఆగష్టు నుంచి వెంకీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది అని తెలుస్తుంది.