ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ.. కొత్త సినిమాలేవీ ఒప్పుకోకుండా కేవలం వెబ్ సీరీస్ షూటింగ్ మాత్రమే చేస్తుంది సమంత. ఆమె నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ కూడా ఈ మధ్యన ఆగిపోయింది అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నటిగానే కాదు సమంత శుభం చిత్రంతో నిర్మాతగానూ మారి సక్సెస్ అయ్యింది.
తాజాగా సమంత ఓ వేదికపై కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తానా 24వ మహాసభలు అమెరికాలో ఘనంగా జరిగాయి. తానా సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్న సమంత ఆ వేదికపై మట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తాను ఈ వేదికపై నిలబడటానికి నాకు 15 ఏళ్ళు పట్టింది. ప్రతి ఏడాది తానా గురించి వింటూనే ఉంటాను. నా మొదటి సినిమా ఏ మాయ చేసావే సినిమా నుంచి మీకు ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు.
నా ఫస్ట్ మూవీ నుంచే మీరు నన్ను ఓన్ చేసుకున్నారు. మీరు నాకు ప్రేమను ఇచ్చారు. కానీ నేను వచ్చి మీకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది. ఇది నా కెరీర్‌లో ఒక ముఖ్యమైన దశ. నా మొదటి ప్రొడక్షన్ శుభమ్, దానిని ఎక్కువగా అభినందించిన వ్యక్తులు ఉత్తర అమెరికాకు చెందినవారు. నేను తీసుకునే ఏ నిర్ణయం అయినా ముందు తెలుగు ప్రేక్షకుల గురించి ఆలోచిస్తాను.
నా కెరీర్‌లో నిర్ణయం తీసుకునే ముందు నాకు వచ్చే మొదటి ఆలోచన అదే. మీరు నాకు ఒక గుర్తింపు ఇచ్చారు. నాకు సొంతిల్లు తెలుగు. నేను నిజంగా చెప్పాలనుకుంటున్నాను. ఓ బేబీ మిలియన్ డాలర్లు సంపాదించానని గుర్తుంది. ఎప్పటికి మీకు కృతజ్ఞురాలిని అంటూ సమంత కన్నీళ్లు పెట్టుకుంది.