Advertisement
Google Ads BL

దివాలా వార్తలపై రకుల్ భర్త జాకీ క్లారిటీ


బాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు జాకీ భగ్నానీ తను సినిమా రంగంలో దివాలా తీశారు అనే వార్తలపై స్పందించారు. రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ రీసెంట్ గా బడే మియా ఛోటే మియా లాంటి పెద్ద సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఈ సినిమా కోసమే ఆయన తన ఆస్తులను తాకట్టు పెట్టగా.. ఆ సినిమా నిండా ముంచేసింది, దానితో జాకీ భగ్నానీ దివాలా తీశారు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. . 

Advertisement
CJ Advs

తాజాగా బడే మియా ఛోటే మియా తో తను చాలా నష్టపోయాను, అలాగే దివాలా వార్తలపై జాకీ భగ్నానీ స్పందించారు. నేను ఆర్ధికంగా దివాలా తీశానని, నాకు ఎంతో ఇష్టమైన ఆఫీసును అమ్మేశానని, చివరకు తినడానికి కూడా డబ్బుల్లేవనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు నేను దేశం విడిచి పారిపోయానని కూడా ప్రచారం చేశారు. 

అసలు ఇలాంటి రూమర్స్‌ ఎక్కడనుండి మొదలయ్యాయో నాకు తెలియడం లేదు. కాకపోతే నేను అమ్మేశానన్న ఆఫీసును తిరిగి సొంతం చేసుకున్నాను. ఈ రూమర్స్ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు.. అంటూ తనపై వస్తోన్న దివాలా వార్తలపై జాకీ భగ్నానీ రియాక్ట్ అయ్యారు. 

Rakul husband responds to bankruptcy rumors:

Rakul Preet Singh husband Jackky Bhagnani responds to bankruptcy rumors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs