నిన్నటివరకు మెగా అభిమానులు కోపంతో ఊగిపోయారు, కానీ ఇప్పుడు హ్యాపీ గా రిలాక్స్ అవుతున్నారు. కారణం గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ పై తమ్ముడు చిత్ర ప్రొడ్యూసర్ శిరీష్ చేసిన కామెంట్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంత కోపంగా ఉన్నారో చూసారు. శిరీష్ సారీ చెబుతూ ప్రెస్ నోట్ వదిలినా వారు శాంతించలేదు.
ఒక వీడియోతో ఆయన మెగా అభిమానులకు దణ్ణం పెడుతూ క్షమాపణ చెప్పారు. అంత జరిగినా శిరీష్ పై మెగా ఫ్యాన్స్ లో తీవ్ర అసహనం తొణికిసలాడింది. ఇప్పుడు తమ్ముడు చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి కనీసం యావరేజ్ రెస్పాన్స్ కూడా రాకపోవడం టీమ్ కి షాకిచ్చింది.
తమ్ముడు ఏ విధంగానూ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. తమ్ముడు రిజల్ట్ చూసాక శిరీష్ కి తగిన శాస్తి జరిగింది అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుకోవడం చూసి అభిమానులు మరీ ఇంతిలా ఉంటారా అంటూ అందరూ షాకవుతున్నారు. అసలు చరణ్ ను ప్రొడ్యూసర్ శిరీష్ ఏ బ్లేమ్ చెయ్యలేదు, కానీ శిరీష్ ను మెగా ఫ్యాన్స్ దారుణంగా టార్గెట్ చెయ్యడమే కాకుండా తమ్ముడు రిజల్ట్ చూసి నవ్వుకోవడం విచిత్రమే మరి.