నిర్మాత నాగవంశీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్ డమ్ రిలీజ్ డేట్ అప్ డేట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసారు. కారణం జులై 4 నుంచి కింగ్ డమ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పటివరకు కొత్త డేట్ లాక్ చెయ్యలేదు. తాజాగా The Hunt is Locked!! At 11:08 AM ~ The roar becomes a reckoning 🐅అంటూ నాగవంశీ వేసిన ట్వీట్ చూసి కింగ్ డమ్ రిలీజ్ డేట్ లాక్ చేసి ఉంటారని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ అభిమానులను నాగవంశీ నిరాశపరిచారు.
కింగ్ డమ్ అప్ డేట్ వదిలేసి తను వార్ 2 తెలుగు హక్కులు దక్కించుకున్న అప్ డేట్ ను నాగవంశీ పంచుకున్నారు. అరవింద సమెత, దేవర చిత్రం తర్వాత హ్యాట్రిక్ రిలీజ్ గా వార్ 2 ని రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్టుగా అద్భుతమైన వీడియో తో నాగవంశీ అఫీషియల్ గా ప్రకటించారు.
ప్రియమైన అభిమానులారా... సిద్ధంగా ఉండండి! మీరు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ని చూడబోతున్నారు... ఈ ఆగస్టు 14న అందరం కలిసి సెలబ్రేషన్స్ ను జరుపుకుందాం మరియు దానిని ఉత్సాహంగా జరుపుకుందాం 🔥🔥 అంటూ నాగవంశీ ట్వీట్ చేసాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ అన్న అంటూ గ్రీక్ గాడ్ హృతిక్, దర్శకుడు ఆయాన్ ముఖర్జీ, నిర్మాతలు యష్ రాజ్ ఫిలిమ్స్ కి నాగవంశీ సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పారు.