పవన్ కళ్యాణ్ గత రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. హరి హర వీరమల్లు, OG షూటింగ్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఫినిష్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే విషయంలో కమిట్మెంట్ తో పని చేస్తున్నారు.
హరి హర వీరమల్లు ఈ నెల 24 న విడుదల కాబోతుండగా.. OG సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న OG ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ చిత్రంపై పాన్ ఇండియా లో భారీ క్రేజ్ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ హాఫ్ ని వీక్షించి కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లుగా తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నవేళ పవన్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ నడుస్తుంది. వీరమల్లు కన్నా భీబత్సమైన క్రేజ్ ఉంది. OG లో పవన్ కళ్యాణ్ లుక్ పవన్ ఫ్యాన్స్ ను బాగా ఇంప్రెస్స్ చేసింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూడని క్షణం లేదు.