థియేటర్స్ లో భారీ డిజాస్టర్ గా నిలిచిన కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రానికి ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బిగ్ షాక్ ఇచ్చింది. థగ్ లైఫ్ థియేటర్స్ లో విడుదల కాకముందు భారీ డీల్ తో డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్. కానీ థియేటర్స్ లో థగ్ లైఫ్ రెస్పాన్స్ చూసి ఆ డీల్ లో కోత పెట్టింది నెట్ ఫ్లిక్స్.
జూన్ 5 న థియేటర్స్ లో విడుదలైన థగ్ లైఫ్ ఎలాంటి హడావిడి లేకుండా నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లో రావడంతో కమల్ ఫ్యాన్స్ షాకయ్యారు. కొంతమంది థగ్ లైఫ్ థియేటర్స్ లో ఎందుకింత డైజెస్టర్ అయ్యిందో చూద్దామని థగ్ లైఫ్ ని ఓటీటీ లో వీక్షించిన వారు.. ఆహా మణిరత్నం ఎలాంటి ఎపిక్ తీసారుగా థగ్ లైఫ్ ని.
కమల్ హాసన్ మరో డిజాస్టర్ చిత్రం ఇండియన్ 2 థగ్ లైఫ్ కన్నా బెటర్ మూవీ. శంకర్ దర్శకత్వంలో కమల్ నటించిన ఇండియాన్ 2 కి భారీ డిజాస్టరే. కానీ ఈ థగ్ లైఫ్ కన్నా ఇండియన్ 2 బెటర్ అంటూ నెట్ ఫ్లిక్స్ లో థగ్ లైఫ్ ని వీక్షించిన ప్రేక్షకులు మాట్లాడుతున్నారంటే.. థగ్ లైఫ్ ఎంత పెద్ద డిజాస్టరో అర్ధమైపోతుంది. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ప్లాప్ అయినా.. ఓటీటీ లో హిట్ అవుతాయి. కానీ థగ్ లైఫ్ కి ఆ ఛాన్స్ కూడా లేకుండా లేదు.