ప్రభాస్ అభిమానులు ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కలిసి చేసిన ఆదిపురుష్ విషయంలో చాలా అవమానాలు ఫేస్ చేసారు. ఆదిపురుష్ పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు. ఆదిపురుష్ ని తెరకెక్కించిన ఓం రౌత్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికి చాలా గుర్రుగా ఉన్నారు. ఆదిపురుష్ ని కామెడీ చేసారు అని ప్రభాస్ ఫ్యాన్స్ బాధ.
అయితే అదే బాలీవుడ్ నుంచి రాబోతున్న రామాయణ పై వస్తున్న రెస్పాన్స్, దానిపై సోషల్ మీడియా లో వచ్చే ఫీడ్ బ్యాక్ చూసి ప్రభాస్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, కన్నడ హీరో యష్ రావణ్ గా, సాయి పల్లవి సీత గా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ చిత్ర గ్లింప్స్ ని విడుదల చేసారు మేకర్స్.
రామాయణ గ్లింప్స్ చూసాక అద్భుతం, విజువల్ వండర్, 3D లో చూస్తే రామాయణ గ్లింప్స్ అదిరిపోతోంది, ఆ గ్లింప్స్ లో లాస్ట్ షాట్ లో రణబీర్ కపూర్ రాముడిగా చెట్టెక్కి వేసిన విల్లు, రావణ్ గా యష్ లుక్స్ అన్ని సూపర్బ్ అంటూ మాట్లాడుకోవడమే కాదు అదే సమయంలో ఆదిపురుష్ ని తెరకెక్కించిన ఓం రౌత్ పై మీమ్స్ వేస్తున్నారు.
ఆదిపురుష్ పై మీమ్స్, రామాయణ పై సూపర్బ్ రెస్పాన్స్ చూసి ప్రభాస్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.