నిన్నటివరకు పూజ హెగ్డే పైనైపోయింది అనుకున్నవారికి అమ్మడు అవకాశాలు పడుతూ బిగ్ షాకిస్తుంది. కోలీవుడ్ కి కేరాఫ్ గా పూజ హెగ్డే మారిపోయింది. వరస వైఫల్యాలతో నిరాశపడిపోయిన పూజ హెగ్డే రెండేళ్ల పాటు సౌత్ వైపు చూడలేదు. టాలీవుడ్ ఆమెని క్రేజీ హీరోయిన్ గా మార్చింది, కానీ ఇప్పుడు అదే టాలీవుడ్ ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసింది.
కోలీవుడ్ లోను విజయ్ తో చేసిన బీస్ట్ డిజాస్టర్ అయ్యింది. అక్కడ కూడా అవకాశాలు నిల్ అనుకున్న సమయంలో సూర్య రెట్రో లో ఛాన్స్ రావడం ఆ వెంటనే కూలి చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ రావడం, విజయ్ తో జన నాయగన్ లో మరోసారి జోడి కట్టే అవకాశం రావడం తో పూజ హెగ్డే కుదురుకుంది అనుకుంటే. రెట్రో రిజల్ట్ అమ్మడుకు షాకిచ్చింది.
అయితేనేమి పూజ హెగ్డే కి లక్కీగా మరో కోలీవుడ్ హీరో ఛాన్స్ ఇవ్వడమే హాట్ టాపిక్ అయ్యింది. ఆ హీరో ధనుష్. విగ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ నటించబోయే సినిమలో పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లుగా తెలుస్తుంది. అదే కాకుండా కాంచన 4 లోను రాఘవ లారెన్స్ తో రొమాన్స్ చేయబోతుంది.
మరి తెలుగు హీరోలు పక్కనపెడితేనేమి.. కోలీవుడ్ హీరోలు పూజ హెగ్డే ని ఆదుకుంటున్నారు, కాదు కాదు పూజ హెగ్డే టైమ్ కోలీవుడ్ లో స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది.