వివాదాస్పద హిందీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. జస్టిస్ అనిష్ దయాల్ ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండవ అనుబంధ ఛార్జిషీట్‌ను, ఢిల్లీ ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విచారణలను కూడా రద్దు చేయాలని ఆమె కోరారు.
ప్రత్యేక కోర్టు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (ఛార్జ్‌షీట్)ను పరిగణనలోకి తీసుకుందని, ప్రాథమికంగా కేసును గుర్తించిందని చెబుతూ ఈడీ న్యాయవాది పిటిషన్‌ను వ్యతిరేకించారు. కాగ్నిజెన్స్ ఆర్డర్‌ను సవాలు చేయలేదని న్యాయవాది తెలిపారు. మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో జాక్విలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలు కాగా, దర్యాప్తులో భాగంగా ప్రశ్నించడానికి ఈడీ ముందు హాజరయ్యారు.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు, శివిందర్ సింగ్ - మల్వీందర్ సింగ్‌ల జీవిత భాగస్వాములను రూ.200 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు చంద్రశేఖర్‌పై కొన్నేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా అనేక కేసుల్లో ప్రమేయం ఉన్న సుకేష్‌పై ఇతర దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఈడీ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా పౌలోస్‌లను ఢిల్లీ పోలీసులు గతంలోనే అరెస్టు చేశారు. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (MCOCA) కింద దంపతులపై కేసు నమోదు చేశారు.
భార్యాభర్తలు ఇద్దరూ లీనా- చంద్రశేఖర్‌లు హవాలా మార్గాలను ఉపయోగించారని, నేర మార్గాల్లో సంపాదించిన డబ్బును దాచిపెట్టడానికి ఇతర నిందితులతో కలిసి షెల్ కంపెనీలను సృష్టించారని ఈడీ అధికారులు ఆరోపించారు.