ఏపీ లో 2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ తన పెద్ద కొడుకు అకీరా నందన్ ను అందరికి ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ దగ్గరనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అందరికి పరిచయం చేసారు. ఇక చిన్న కొడుకు మార్క్ శంకర్ ను ఎక్కువగా బయటకు తీసుకురాని పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఇద్దరు వారసులతో కలిసి ఏపీలో కనిపించడం అభిమానులను ఎగ్జైట్ చేసింది.
పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైద్రాబాద్ నుంచి శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ అధికారులతో, పార్టీ ప్రతినిధులతో సమావేశమై ముఖ్యమైన విషయాలపై చర్చించారు.
ఆతర్వాత ఇద్దరు వారసులతో కలిసి పవన్ కళ్యాణ్ మార్కాపురం నియోజక వర్గం పర్యటనకి బయలుదేరారు. మరి తన పర్యటనలో భాగంగా కొడుకులు అకీరా, మార్క్ శంకర్ ను తీసుకువెళ్లడం, అది చూడడానికి పవన్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.