నితిన్ హీరోగా వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ అందించిన తమ్ముడు చిత్రం నేడు జులై 4 న విడుదలైంది. దిల్ రాజు బ్యానర్ లో వస్తోన్న తమ్ముడు చిత్రాన్ని చిత్ర బృందం బాగా ప్రమోట్ చేసింది. కామన్ ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్ అంటూ టీమ్ చేసిన హడావిడి ప్రేక్షకులకు బాగానే రీచ్ అయ్యింది. మాజీ హీరోయిన్ లయ తమ్ముడు తో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక తమ్ముడు ఓవర్సీస్ షోస్ పూర్తి కావడంతో అక్కడి ఆడియన్స్ తమ్ముడు చిత్రం పై వేస్తోన్న ట్వీట్స్ తో సోషల్ మీడియా సందడిగా మారింది.
ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. తమ్ముడు ఫస్ట్ హాఫ్ లో విజువల్స్, లొకేషన్స్ మంచి అనుభూతినిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో నితిన్ కేరెక్టర్ అంతగా ఇంప్రెస్స్ చెయ్యదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇరగదీసింది, నితిన్ పెరఫార్మెన్స్ వేరే లెవల్, డీసెంట్ BGM అంటూ కొంతమంది తమ్ముడు ని వీక్షించిన వారు ట్వీట్లు పెడుతున్నారు.
తమ్ముడు ఎమోషనల్ రైడ్, అక్క-తమ్ముడు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది, ఫస్ట్ హాఫ్ లైట్ గానే ఉంది, కొత్తగా ట్రై చేసారు కానీ.. కొన్ని సీన్స్ మాత్రం కామెడీగా బావున్నాయి. సెకండ్ హాఫ్ బావుంది, నితిన్ నటన, విలన్ కేరెక్టర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే వీక్ నేరేషన్, ల్యాగ్, సాంగ్స్ మాత్రమే కాదు హీరోయిన్ సప్తమి గౌడ కూడా చిరాకు తెప్పిస్తుంది అంటూ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు.
వేణు శ్రీరామ్ తమ్ముడు సబ్జెక్టు ని చక్కగా హ్యాండిల్ చేసాడు, ఫస్ట్ హాఫ్ తేల్చేసినా సెకండ్ హాఫ్ సినిమాని నిలబెడుతుంది అంటూ తమ్ముడు ని చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. తమ్ముడు పూర్తి రివ్యూ మరికాసేపట్లో..