బాలీవుడ్ లో నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి విలన్ గా రావణ్ పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఎంతోమంది, ఎన్నోసార్లు ఇతివృత్తంగా రామాయణాన్ని తెరకెక్కించారు, కానీ ఈ నితీష్ తివారి ఈ రామాయణ ని ఎలా తెరకెక్కిస్తున్నారని విషయంలో దేశం మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తుంది.
తాజాగా రామాయణ నుంచి గ్లింప్స్ వదిలింది టీమ్. రామాయణ గ్లింప్స్ కి ఆ ఒక్క షాట్ చాలు అంటూ చూసిన వారంతా మట్లాడుకుంటునున్నారు. ప్రతి ఫ్రేమ్ అద్దిరిపోయింది, విజువల్ గ్రాఫిక్స్ రామాయణ చిత్రానికి హైలెట్ అంటుంటే.. ఆ గ్లింప్స్ లో లాస్ట్ షాట్ అంటే రాముడి గెటప్ లో రణబీర్ కపూర్ పరిగెడుతూ చెట్టెక్కి బాణం వదిలే సీన్, రావణ్ గా యష్ లుక్ ఈ రామాయణ గ్లింప్స్ కి హైలెట్ కాదు కాదు ఆ ఒక్క సీన్ చాలు అంటూ అందరూ ఆ షాట్ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక సీత కేరెక్టర్ లో సాయి పల్లవి ని రివీల్ చెయ్యలేదు కానీ.. రణబీర్ ని చూస్తే వావ్ ఎంత నీట్ గా ఉన్నాడు రాముడు, ఇక రావణ్ గా యష్ పూర్తి లుక్ వదలకపోయినా అతని లుక్ మాత్రం భీబత్సమే అన్నట్టుగా కాస్త రివీల్ చేసి ఊరించారు మేకర్స్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న రామాయణ ని చూసేందుకు యావత్ భారత దేశం ఎదురు చూసేలా రామాయణ గ్లింప్స్ ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.