బెల్లంకొండ శ్రీనివాస్-మంచు మనోజ్-నారా రోహిత్ కలయికలో విజయ్ కనకమేడల తెరకెక్కించిన మూవీ భైరవం. మే 30న విడుదలైన భైరవం ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు నటన పరంగా బెస్ట్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
భైరవం ఓటీటీ హక్కులను ZEE5 ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. ఈ చిత్రం విడుదలై నెల కావడంతో భైరవం చిత్ర ఓటీటీ డేట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ZEE5 త్వల్లోనే భైరవం చిత్రాన్ని ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి తేబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది.
అంటే బెల్లకొండ-మంచు మనోజ్ ల భైరవం చిత్రం అతి త్వరలోనే ZEE5 ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతుందన్నమాట.