గత ఐదేళ్లుగా సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఈ నెల 24 న పాన్ ఇండియా లో విడుదలకు రెడీ అయ్యింది. క్రిష్ డైరెక్షన్ నుంచి జ్యోతికృష్ణ చేతుల్లోకి మారిన హరి హర వీరమల్లు చిత్రం ప్రమోషన్స్ నేడు వీరమల్లు ట్రైలర్ రిలీజ్ తో గ్రాండ్ గా మొదలు పెట్టారు మేకర్స్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వీరమల్లు ట్రైలర్ చూసి అద్భుతమని, సర్ ప్రైజ్ అయినట్లుగా హరి హర వీరమల్లు పై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. నాలుగు రోజులుగా వీరమల్లు ట్రైలర్ పై చిత్ర బృందం ఇస్తున్న అప్ డేట్స్ తో ట్రైలర్ పై అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా విడుదలైన హరి హర వీరమల్లు ట్రైలర్ లోకి వెళితే.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ మొదలైన ట్రైలర్ ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినీర్.. దానిని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామ బాణం కావాలి అంటూ తనికెళ్ళ భరణి వాయిస్ తో వీరమల్లు గా పవన్ ఎంట్రీ అద్దిరిపోయింది. పవన్ కళ్యాణ్ గురం పైకి ఎక్కే సీన్ చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ రావాల్సిందే.
ఇప్పటివరకు మేకలు తినే పులిని చూసుంటారు, ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పిన మాసివ్ డైలాగ్, నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు.. వినాలి వీరమల్లు చెప్పింది వినాలి అంటూ పవన్ చెప్పిన కూల్ డైలాగ్స్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి.
అంతేకాదు పవన్ యాక్షన్ చూస్తే అభిమానులు విజిల్స్ వెయ్యాల్సిందే. పవన్ కత్తిసాము, విల్లుని తిప్పే విధానానికి అభిమానులు ఫిదా అవ్వాల్సిందే. వీరమల్లుగా పవన్ లుక్స్, ఆయన యాక్షన్, BGM, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని వీరమల్లు ట్రైలర్ కి హైలెట్స్ గా నిలిచాయి.