పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరి హర వీరుమల్లు జులై 24 న పాన్ ఇండియా ఫిలిం గా విడుదలకాబోతుంది. ఈరోజు వీరమల్లు ట్రైలర్ వస్తోంది. ఇకపై హరి హర వీరమల్లు ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆతర్వాత రెండు నెలల గ్యాప్ లో అంటే సెప్టెంబర్ 25 నే పవన్ కళ్యాణ్ మరో మూవీ OG ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ OG షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ లోనే ముగించడంతో దర్శకుడు సుజిత్ గబగబా పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టెయ్యడం, ఆ వెంటనే దానయ్య OG రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటించడం జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ వీరమల్లు పనులు ముగించి OG పనులు ఫినిష్ చేశారు, ఇక సినిమా సెప్టెంబర్ 25 న పక్కాగా రిలీజ్ అనుకున్న సమయంలోనే OG విడుదల వాయిదా అంటూ ప్రచారం షురూ అయ్యింది.
హరి హర వీరమల్లు పదే పదే పోస్ట్ పోన్ అయినట్లుగానే OG కూడా సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టడంతో OG మేకర్స్ వెంటనే అలెర్ట్ అయ్యారు. రూమర్స్ ని నమ్మకండి.. Rumours ni Nammakandi… #TheyCallHimOG arrives on Sept 25th!!🤟🏻 #OG అంటూ ఇచ్చిన అప్ డేట్ పవన్ ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది.
అసలే హరి హర వీరమల్లు చాలాసార్లు పోస్ట్ పోన్ అవడంతో సినిమాపై క్రేజ్ తగ్గింది అనే వార్తల నేపథ్యంలో OG పై ఇలాంటి వార్తలను వాళ్ళను ఆందోళనకు గురి చేసాయి. ఇప్పుడు మేకర్స్ క్లారిటీతో వారు రిలాక్స్ అవుతున్నారు.