ఐటి మినిస్టర్ నారా లోకేష్ పై వైసీపీ నేతలు కుట్రకు తెరలేపేలా ప్లాన్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదంలో జగన్ కారు కిందే పడి ప్రాణాలు వదిలిన వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి విషయంలో వైసీపీ రాక్షస క్రీడకు తెరలేపింది అనేది టీడీపీ కార్యకర్తల వాదన. జగన్ కారు కింద నలిగి సింగయ్య మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. జగన్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. కానీ జగన్ తనను అరెస్ట్ చెయ్యకుండా ముందుగానే హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
అదలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి చనిపోయిన సింగయ్య కుటుంబాన్ని తన కార్యాలయానికి పిలిపించుకుని పది లక్షల ఆర్థిక సహాయం చెయ్యడంతో సింగయ్య భార్య జగన్ కు దాసోహమనడమే కాదు.. వారు ఆడమన్నట్టుగా ఆడడం స్టార్ట్ చేసేసింది. సింగయ్య మృతి జగన్ కాన్వాయ్ వల్ల జరగలేదు, ఆయనకు చిన్న చిన్న దెబ్బలే తగిలాయి, ఆయనను అంబులెన్సు కి ఎక్కించాకే ఆయన చనిపోయాడు, దీనికి కారణం అంబులెన్స్ అని మాట్లాడడమే కాదు..
లోకేష్ దగ్గరనుంచి తమ ఇంటి దగ్గరకీ కొంతమంది వ్యక్తులు వచ్చి బెదిరించారు. వైసీపీ కి జగన్ కు వ్యతిరేఖంగా మాట్లాడకపోతే ఊరుకోమన్నారు, మాకు ఎలాంటి సహాయం చెయ్యకపోయినా వారు మమ్మల్ని బెదిరించారు, వారు లోకేష్ మనుషులే, మేము ఎప్పటికి జగన్ కు విధేయులమే అంటూ సింగయ్య భార్య మీడియాకి చెప్పడం చూసిన వారు జగన్ దగ్గర సొమ్ము ముట్టాక లోకేష్ ని బ్యాడ్ చేసేలా సింగయ్య భార్యతో వైసీపీ నేతలే చెప్పించారు.
అసలు సింగయ్య భార్య దగ్గరకు ఎవ్వరూ వెళ్ళలేదు, ఆమెను బెదిరించలేదు, ఆమెకు ఆర్థిక సహాయం అంటూ ఆదుకుంటామంటూ వైసీపీ వాళ్లే ఆశచూపి లోకేష్ పై కుట్ర పూరిత మాటలు మట్లాడిస్తున్నారు, లోకేష్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు, అందుకే ఇలాంటి కుట్రకు ప్లాన్ చేసారు అంటూ టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.