కమల్ హాసన్-మణిరత్నం కలయికలో తెరకెక్కిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5 భారీ అంచనాలతో థియేటర్స్ లో విడుదల కాగా ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కమల హాసన్ పాత్ర కూడా ప్రేక్షకులకు నచ్చలేదు, శింబు సీన్స్ బావున్నా రెహమాన్ మ్యూజిక్ నచ్చకపోవడం, మణిరత్నం అవుట్ డేటెడ్ మేకింగ్ అన్ని కలగలిపి థగ్ లైఫ్ ని కిల్ చేసాయి.
అయితే థగ్ లైఫ్ ఓటీటీ పై కూడా చాలా రచ్చే నడిచింది. థియేటర్స్ లో ప్లాప్ అయిన మూవీ డిజిటల్ రైట్స్ ని భారీ డీల్ తో దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ముందుగానే స్ట్రీమింగ్ లోకి తెస్తుంది, అందుకోసం కొంత ఎమౌంట్ కూడా పే చేసింది అనే టాక్ నడిచింది. థగ్ లైఫ్ ఓటీటీ విషయంలో ఏదో గందరగోళం జరిగింది అనుకున్నారు.
ఇక థియేటర్స్ లో ప్లాప్ అయిన థగ్ లైఫ్ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి తెస్తుంది.. అని అనుకుంటున్న సమయంలో థగ్ లైఫ్ ని నెట్ ఫ్లిక్స్ ఈరోజు జులై 4 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది. సైలెంట్ గా థగ్ లైఫ్ ఓటీటీ ఎంట్రీ పై అందరూ నిజంగా షాకవుతున్నారు.