Advertisement
Google Ads BL

జగన్ కి అది చేతయితే..


ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అధికార దర్పాన్ని చూపించకుండా సామాన్య ప్రజల వద్దకు వెళ్లి వారితో కలిసి మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రతినెలా పెన్షన్ సమయానికి చంద్రబాబు ఒక్కో ఇంటికి వెళ్లి వారి సాధకబాధకాలు వింటూ వారి ఆదిత్యం స్వీకరిస్తూ అర్హులకు పెన్షన్ అందిస్తున్నారు. 

Advertisement
CJ Advs

జులై 1 న కూడా రాజమండ్రి దగ్గర మలకలపల్లి లోని చర్మ కారి ఇంటికి వెళ్ళి అతని కుటుంబానికి పెన్షన్ అందించడమే కాదు అతన్ని తన కారులో ఎక్కించుకుని  కుటుంబ పరిస్థితులు తెలుకున్న చంద్రబాబు ఆతను చేసే పని గురించి తెలుసుకున్నారు. చంద్రబాబు లా జగన్ చెయ్యగలరా, అదే చేతయితే జగన్ కి ఎందుకు అధికారం పోతుంది అంటూ బ్లూ మీడియానే జగన్ ని వేలెత్తి చూపిస్తుంది. 

అధికారం కోసం పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి అధికారం వచ్చాక ప్రజలను పక్కన పెట్టడమే ఆయనకు మరోసారి అధికారం దక్కకుండా చేసింది అనేది వాస్తవం. మరి జగన్ కూడా ప్రజలతో మమేకమైతే మరోసారి అధికారం దక్కేది, ఇప్పుడు ఏపీ కి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే తీరు చూసి ఇది జగన్ కి ఇదే చేతయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ వైసీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. 

Jagan Mohan Reddy :

Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs