సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కనిపిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కు యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఆమెకు ఊపిరి సలపనంత కాదు. అందుకే పర భాషల అవకాశలు కూడా వదులుకోవడం లేదు. తెలుగు, తమిళమే కాదు తన మాతృభాష మలయాళం లోకి కూడా చాలా ఏళ్ళ తర్వాత అడుగు పెట్టింది.
ఇక పరదా లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ మంచి ఊపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అనుపమ కు గ్లామర్ పాత్రాలు రావడమే కాదు, ఆమె కూడా సోషల్ మీడియాలో అందాలు జాతర మొదలు పెట్టింది.
తాజాగా చక్కటి చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్ చిలిపిగా ఇచ్చిన ఫోజులకు యూత్ మొత్తం ఫిదా కావాల్సిందే. శారీలో అనుపమ కర్లీ హెయిర్ తో చిలిపిగా బ్యూటిఫుల్ గా కనిపించింది. మీరు కూడా అనుపమ కొత్త పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.