వల్లభనేని వంశీ వైసీపీ ప్రభుత్వంలో అధికార మదంతో చేసిన తప్పిదాలకు కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి 137 రోజులైంది. హైదరాబాద్ గుచ్చిబౌలీలో వంశీ నివాసంలోనే ఏపీ పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.టీడీపీ ఆఫీస్ దాడి, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణి కేసుల ఇలా 11 కేసులు వంశీ మెడకు చుట్టుకున్నాయి.
జైలులో ఉండగానే శ్వాస కోశ సంబందిత సమస్యలతో ఇబ్బందిపడిన వంశీ జైలుకెళ్లేటపుడు పులిలా కనిపించినా.. నేడు జైలు నుంచి విడుదలైనప్పుడు అసలు వంశీనేనా మనం చూస్తున్నది అనిపించే అంత మార్పుతో కనిపించారు. 137 రోజులుగా ఖైదీగా ఉన్న వంశీ కి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ రావడమే కాదు ఆయనకు మిగతా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది.
నిన్ననే వంశీకి బెయిల్ రాగా.. ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు బుధవారం విజయవాడ సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. వంశీపై మొత్తం 11 కేసులు నమోదైనప్పటికీ, అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో బుధవారం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.