ఈమధ్యన వారం గ్యాప్ లో విడుదలైన రెండు సినిమాల్లో ఇద్దరు స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించి ఆ సినిమాలను ఒడ్డునపడేసారు అనేది వాస్తవం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేర చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించారు. కుబేర చిత్రం తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అవడము, నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ అవడము కుబేర రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
తెలుగులో నాగార్జున వలన కుబేర కి మైలేజ్ వచ్చింది అనేది వాస్తవం. అదే మాదిరి గత వారం విడుదలైన మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి ఫస్ట్ హాఫ్ వీక్ అయినా సెకండ్ హాఫ్ అద్భుతం అంటూ కన్నప్పకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ప్రభాస్ స్టామినా కన్నప్పను నిలబెట్టింది, కలెక్షన్స్ ఎంతొస్తుంది అనేది పక్కపెడితే కన్నప్పలో ప్రభాస్ రుద్రా కేరెక్టర్ గురించి కేవలం అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.
కుబేర చిత్రానికి నాగార్జున అప్పీరియన్స్ ఎంత హెల్ప్ అయ్యిందో.. కన్నప్ప కు ప్రభాస్ కేరెక్టర్ అంతకన్నా ఎక్కువే హెల్ప్ అయ్యింది. అక్కడ నాగ్ కుబేర ను నిలిబెడితే ఇక్కడ ప్రభాస్ కన్నప్పను నిలబెట్టారు. కుబేరలో ధనుష్ నటుడిగా అందరికి నచ్చినా నాగార్జున కేరెక్టర్ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది.
కన్నప్ప క్లైమాక్స్ లో మంచు విష్ణు ఎంత బాగా చేసినా, ప్రభాస్ రుద్రా కేరెక్టర్ కన్నప్పను నిలబెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.