రీసెంట్ గా హీరోయిన్ కోమలి ప్రసాద్ డాక్టర్ కోట్ వేసుకుని ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ గా టాప్ పొజిషన్ కి చేరుకోలేకపోయినా.. అడపాదడపా సినిమాల్లో కనిపించే కోమలి ప్రసాద్ ఇకపై డాక్టర్ గా సేవలు అందిస్తుంది, అందుకే ఆమె ఇలాంటి పిక్ షేర్ చేసింది, నటనకు గుడ్ బై చెప్పి డాక్టర్ గా కొనసాగుతుంది అంటూ ప్రచారం షురూ అయ్యింది.
కోమలి ప్రసాద్ ఇకపై డాక్టర్ అంటూ వస్తోన్న ప్రచారం పై కోమలి ప్రసాద్ రియాక్ట్ అయ్యింది. నేను రీసెంట్ గా పెట్టిన పోస్ట్ పై ఇన్ని రకాల రూమర్స్ వస్తాయనుకోలేదు, నేను ఫుల్ టైమ్ డాక్టర్ అవుతున్నాను అని, యాక్టింగ్ కి గుడ్ బై చెబుతున్నాను అని చాలామంది అపోహపడుతున్నారు, మీడియా లో కూడా అలాంటి కథనాలు రావడం బాధాకరం. అందులో ఎలాంటి నిజం లేదు, ఎంతో కష్టపడి నటిగా ఎదిగాను, దేవుడి దయతో కెరీర్ ని కొనసాగిస్తున్నాను.
విధి నన్ను నటన రంగం వైపు నడవమంది, నేను అదే నమ్ముతున్నాను, ఇలాంటి సమయంలో ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చెందకూడదు అనే నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను అంటూ కోమలి ప్రసాద్ డాక్టర్ గా కొనసాగే వార్తలపై వివరణ ఇచ్చింది.