మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కన్నప్ప ను జూన్ 27 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒంటి చేత్తో కన్నప్ప ప్రమోషన్స్ ని మోసిన విష్ణు కు కన్నప్ప చిత్ర రిజల్ట్ భారీ ఊరటనిచ్చింది. కన్నప్ప చిత్ర సెకండ్ హాఫ్ కు ప్రభాస్ రుద్ర కేరెక్టర్ కు, మంచు విష్ణు క్లైమాక్స్ లో చేసిన పెరఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది.
కన్నప్పకు కావల్సింది కలెక్షన్స్ కాదు, పేరు వస్తే చాలు అన్నట్టుగా మంచు విష్ణు కన్నప్ప చిత్ర లెక్కలపై ఎక్కడా అధికారిక ప్రకటన జారి చెయ్యలేదు. ఇక కన్నప్ప మిగతా భాషల పెరఫార్మన్స్ ఎలా ఉన్నా.. కన్నప్ప కు హిందీ శాటిలైట్ లైట్ డీల్ కి అదిరిపోయే ధర పలికినట్లుగా తెలుస్తుంది.
కన్నప్ప హిందీ శాటిలైట్ డీల్ 20 కోట్లు పలికినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి కన్నప్ప హిందీ శాటిలైట్ కి 20 కోట్లు నాన్ ధియేట్రికల్ రైట్స్ నంచి రావడం మంచు విష్ణు కి కలిసొచ్చే అంశమే. అయితే కన్నప్ప కు అంత భారీ డీల్ రావడానికి హిందీలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కూడా ఓ కారణమంటున్నారు.