గతంలో పాదయాత్రతోనే ప్రజల్లోకి వెళ్లి తనకంటూ ఇమేజ్ తెచ్చుకుని.. రాజకీయంగా ఎదిగి అదే పాదయాత్రతో 2019ఎన్నికల్లో గెలుపు సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ అప్పుడు కార్యకర్తలకు, ప్రజలకు తగిన గౌరవమిచ్ఛారు. 2019 ఎన్నికలో గెలిచి అధికారం చేపట్టాక వైసీపీ కార్యకర్తలను, ప్రజలను పక్కనపెట్టిన జగన్ 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవి చూసారు.
అయితే గత ఏడాది కాలంగా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా, కార్యకర్తలను పట్టించుకోకుండా, తమ పార్టీ నేతలు జైలుకు వెళితే వారిని పరామర్శించడానికే జగన్ కి సమయం సరిపోతుంది. కూటమి ప్రభుత్వం విషయంలో ఫైట్ చెయ్యడం మానేసి జగన్ ఇంకా తాడేపల్లి-బెంగుళూర్ ప్యాలెస్ ల్లోనే సేద తీరుతూ అప్పుడప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు. తాజాగా జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యూత్ వింగ్ నేతలతో జరిగిన సమావేశంలో జగన్ కీలక ప్రకటన చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు జగన్ పాదయాత్ర గురించి అడగగా.. దానికి జగన్ ముందు జిల్లాల వారీగా సమీక్షలు చేసాక తర్వాత పాదయాత్ర పై ప్రకటన వస్తుంది అంటూ ప్రకటించడంతో వైసీపీ కేడర్‌లో కొత్త ఉత్తేజం నెలకొంది. గతంలో జగన్ చేపట్టిన పాదయాత్రలు ఆయనకు, పార్టీకి ఎంతో బలాన్ని చేకూర్చిన విషయం తెలిసిందే.