హరి హర వీరమల్లు సినిమా పదే పదే వాయిదా పడడంతో చాలామందిలో ఈ చిత్రంపై ఆసక్తి సన్నగిల్లింది అనే చెప్పాలి. అదే పవన్ ఫ్యాన్స్ టెన్షన్ కూడా.. పవన్ కళ్యాణ్ డేట్స్ ఒకసారి ప్రాబ్లెమ్ అయితే, మరోసారి పోస్ట్ ప్రొడక్షన్ ఇతరత్రా, ఇంకోసారి వీరమల్లు బిజినెస్ జరగక ఇలా వీరమల్లు అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఇప్పుడు జులై 24 న సినిమా విడుదల చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించినా అందులో అందరికి ఇంట్రెస్ట్ కనిపించడం లేదనే టాక్ మొదలైంది. కానీ మేకర్స్ ఈ నెల 3 న వదలబోయే హరి హర వీరమల్లు ట్రైలర్ తో సినిమాకు ఊపొస్తుంది అంటూ క్రేజీ అప్ డేట్స్ ఇస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ అప్ డేట్స్ లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పోస్టర్స్ వదులుతున్నారు.
మరి వీరమల్లు తో పాన్ ఇండియా మార్కెట్ లో సినిమాపై ఏమైనా ఆసక్తి స్టార్ట్ అవుతుందా అనేది పవన్ ఫ్యాన్స్ బాధ. క్రిష్ దర్శకుడిగా తప్పుకున్నాక వచ్చిన జ్యోతి కృష్ణ వీరమల్లులో కాస్త మార్పులు చేసారని, యానిమల్ మూవీ తర్వాత వీరమల్లు విలన్ బాబీ డియోల్ పాత్రని మార్చారని మేకర్స్ ఓపెన్ గా చెప్పేసారు. మరి హరి హర వీరమల్లు ట్రైలర్ తర్వాత జరగబోయేది చూడాలి.