సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పాన్ ఇండియా మార్కెట్ ని చక్కబెట్టేస్తూ క్రేజీ గా మారిన రష్మిక మందన్న రీసెంట్ గా కుబేర తో పాన్ ఇండియా హిట్ కొట్టింది. ఇదే ఏడాది ఛావా తో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మద్యలో సికందర్ డిజాస్టర్ తో కాస్త ఇబ్బంది పడినా మళ్ళీ కుబేర తో కుదురుకుంది. ఇలాంటి సక్సెస్ ఉన్న హీరోయిన్ వెంట స్టార్ హీరోలు పడడం సహజం.
కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ ఎవరూ రష్మిక మందన్న ను కన్సిడర్ చేయకపోవడమే విచిత్రంగా ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఏ ఒక్క హీరో రష్మిక వైపు చూడడం లేదు. రీసెంట్ గానే ఎన్టీఆర్, చరణ్ సినిమాలు మొదలయ్యాయి. చరణ్ పెద్ది లో జాన్వీ కపూర్ హీరోయిన్. ఇక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ అంటున్నారు.
మరి రష్మిక ను ఎందుకు హీరోయిన్ గా అనుకోవడం లేదు, ఆమె హిందీలోనూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాంటి హీరోయిన్ ని పాన్ ఇండియా మూవీస్ లోకి తీసుకోకవచ్చు. కానీ ఈ హీరోలు వేరే హీరోయిన్స్ వెంటే పడుతున్నారు తప్ప ఈ సక్సెస్ ఫుల్ హీరోయిన్ వంక చూడకపోవడమే షాకింగ్ అని చెప్పాలి.