ఇంకా పట్టుమని పది సినిమాలు అయినా చేయలేదు. కనీసం నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. అయినా ఈ నటవారసురాలి హంగామా మాత్రం మరో లెవల్లో ఉంది. ఓవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడిపోయింది. అయినా ప్రియుడితో షికార్లలో ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు గ్లామరస్ ఫోటోషూట్లతోను చెలరేగిపోతోంది. ఈ బ్యూటీ ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర నటి శ్వేతా తివారీ నటవారసురాలు పాలక్ తివారీ.
ఇంకా బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించక ముందే పటౌడీ సంస్థాన వారుసడు ఇబ్రహీంతో డేటింగ్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. అయితే తన కుమార్తె తీరు తెన్నులు నచ్చక, శ్వేతా తివారీ మాజీ భర్త రాజా చౌదరి చురకలు అంటించే ప్రయత్నం చేసారు. ``మొదట నటన మొదలు పెట్టు.. ఆ తర్వాత డేటింగులు చేయొచ్చు!`` అంటూ కూతురికి కొంత స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చాడు.
ఈ తరం అపరిపక్వ దశలో తప్పులు చేస్తున్నారని, వృత్తిని లైట్ తీస్కుంటున్నారని కూడా అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో నటవారసుల పరిస్థితి అంతగా బాలేదని కూడా అతడు పరోక్షంగా విమర్శించారు. అయితే శ్వేతా తివారీ నుంచి విడిపోయిన తర్వాత రాజా చౌదరి తన భార్య, వారసులకు దూరంగా ఉన్నారు