Advertisement
Google Ads BL

రూమర్స్ పై అభిషేక్ బచ్చన్ ఫైర్


కొన్నాళ్లుగా బాలీవుడ్ యాక్ట్సర్స్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంటే సోషల్ మీడియా మాత్రం అభిషేక్-ఐశ్వర్యాలను ఎప్పుడో విడగొట్టేసింది. వారు సింగిల్ గా కనిపిస్తే చాలు వారికి విడాకులు అయ్యాయనే వార్త తెగ వైరల్ అవుతుంది.

Advertisement
CJ Advs

ఎప్పటికప్పుడు అభిషేక్ బచ్చన్ ఈ విడాకుల వార్తలను ఖండిస్తున్నా ఆ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడమే లేదు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి ఫేక్ న్యూస్ ల వలన ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయో మీకు అర్ధం కావడం లేదు అంటూ అభిషేక్ బచ్చన్ ఫైర్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. నేను మాత్రమే కాదు ప్రతి ఒక్క సెలెబ్రిటీ ఇలానే సఫర్ అవుతున్నారు. 

సినిమా ఇండస్ట్రీలో వ్యవహారాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఇలాంటి వాటివల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ కాను, కానీ అందులో కుటుంబాలు కూడా ఇమిడి ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనే కొత్త ఫ్యాషన్ నడుస్తోంది, ఏ రూమర్ అయినా, ఎంతటి వారైనా సరే, ఇలాంటివి బాధపెడతాయి. అదే మీ విషయంలో జరిగితే ఎలా ఉంటుంది అంటూ అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ట్రోల్స్, రూమర్స్ పై రియాక్ట్ అయ్యారు. 

చాలా సందర్భాల్లో అభిషేక్ బచ్చన్ ఐష్ తో విడాకులు అయ్యాయనే రూమర్స్ పై స్పందిస్తున్నా.. ఆ రూమర్స్ మాత్రం ఆగడం లేదు, అందుకే అభిషేక్ విడాకుల విషయంలో ఇలా ఇండైరెక్ట్ గా స్పందింస్తూ ఉన్నారు. 

Abhishek Bachchan fires back at rumors:

Abhishek Bachchan opened up about the emotional toll of rumors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs