Advertisement
Google Ads BL

కింగ్‌డమ్ ఒక విన్నర్


విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కలయికలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కిన కింగ్ డమ్ చిత్రం విడుదల తేదీ కోసం దేవరకొండ అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. జులై 4 న విడుదల కావాల్సిన కింగ్ డమ్ రిలీజ్ వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ రషెస్ చూసాక కొన్ని సీన్స్ రీ షూట్ చేయడంతోనే కిన్ డమ్ పోస్ట్ పోన్ అయ్యింది అనే ప్రచారం ఉంది. 

Advertisement
CJ Advs

అయితే అది ఎప్పటివరకు, అసలు ఎప్పుడు సినిమాని రిలీజ్ చేస్తారనే విషయంలో విజయ్ దేవరకొండ అభిమానులు నిర్మాత నాగవంశీ పై ఫైర్ అవుతున్నారు. నాగవంశీ కింగ్ డమ్ విషయాలు వదిలేసి వేరే సినిమాల విషయాలను మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాగవంశీ కింగ్ డమ్ అభిమానులకు క్రేజీ హామీ చ్చారు. 

నన్ను నమ్మండి.. ఈ సినిమాతో మీకు ఫుల్ మీల్సే అంటూ చెప్పిన నాగవంశీ ఏం పోస్ట్ చేసినా కింగ్‌డమ్ మీద మాత్రం తీయటి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు, కానీ నన్ను నమ్మండి. ఒక భారీ బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ఇవ్వడానికి మా చిత్ర బృందం రేయింబవళ్లు కష్టపడుతోంది.

ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా చూసినపుడు వచ్చే అడ్రెనలిన్ రష్ నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఎంతో నమ్మితే కానీ నేను  ఏదీ చెప్పను. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా చూపిస్తారు నా మీద. సినిమా చూశాక చెబుతున్నా.. కింగ్‌డమ్ ఒక విన్నర్. ఇది ఫుల్ మీల్స్ కమర్షియల్ ఎంటర్టైనర్. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్, పాట అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం అంటూ నాగవంశీ సోషల్ మీడియా వేదికగా కింగ్ డమ్ పై చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. 

Nagavamsi about Kingdom release:

Kingdom Release: Naga Vamsi has a Clear Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs