Advertisement
Google Ads BL

ప‌ని గంట‌ల‌పై దీపిక మొండి ప‌ట్టు


ఎనిమిది గంటల పని దినం డిమాండ్ కారణంగా దీపికా పదుకొనే `స్పిరిట్` నుండి నిష్క్రమించాక‌, బాలీవుడ్ వ‌ర్క్ క‌ల్చ‌ర్ పై చాలా చ‌ర్చ సాగుతోంది. ఇది పరిశ్రమ వ్యాప్తంగా ఒక ముఖ్యమైన డిబేట్ కి తెర తీసింది. అయితే దీపిక తాజా ఇంట‌ర్వ్యూలో త‌న వాద‌న‌ను స‌మ‌ర్థించుకుంది. బాలీవుడ్‌లో ఆరోగ్యకరమైన పని సంస్కృతి కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాన‌ని దీపిక చెప్పింది. ప‌నికి త‌గ్గ వేత‌నం, అంద‌రికీ స‌మాన ప‌నిగంట‌లు కావాల‌నే అంశంపై తాను చాలా కాలంగా పోరాడుతున్నాన‌ని తెలిపింది. అద‌న‌పు ప‌ని గంట‌లు అద‌న‌పు ఒత్తిడిని పెంచి ఔట్ పుట్ పై ప్ర‌భావం చూపుతాయ‌ని దీపిక వెల్ల‌డించింది.

Advertisement
CJ Advs

 

త‌న వైఖ‌రి ఇప్పుడే కొత్త కాదు. తల్లి కావడానికి చాలా కాలం ముందు ప‌ని గంట‌ల విష‌యంలో లిమిటేష‌న్ కావాల‌ని కోరుకున్న‌ట్టు దీపిక తెలిపారు. న్యాయమైన షెడ్యూల్‌లను సమర్థించడం, తెరవెనుక సిబ్బందికి మెరుగైన ట్రీట్ మెంట్ ఇవ్వ‌డాన్ని సమర్థిస్తాన‌ని అంది. ఫిల్మ్ కంపానియన్‌తో ఇంట‌ర్వ్యూలో దీపిక తన నిరాశ- డిప్రెష‌న్‌తో పోరాటం తనకు వ‌ర్క్- లైఫ్ బ్యాలెన్స్ ప్రాముఖ్యతను అర్థ‌మ‌య్యేలా చెప్పింద‌ని, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని నిజంగా అర్థం చేసుకునేలా చేసిందని తెలిపింది.

 

షెడ్యూల్‌ల కోసం అదుపు త‌ప్పిన ప‌ని గంట‌లు ఒకప్పుడు తన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపాయో వెల్ల‌డించింది. ఈ ప‌రిస్థితులే తాను బౌండ‌రీస్ ని నిర్ణయించుకునేలా ప్రేరేపించాయని గుర్తుచేసుకుంది. సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవ‌స‌రమ‌ని దీపిక చెప్పింది. అలసట లేకుండా ప‌ని చేయ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని దీపిక వెల్ల‌డించింది. భారతదేశంలో ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో, ఉద్యోగి స‌మ‌యం లాక్కుంటున్నారంటే, అది వృత్తిపరమైనది కాదు.. ఉద్యోగికి ఆశయం స‌రిగా లేకపోవడం అని దీపిక లోపాన్ని ఎత్తి చూపింది. వ్య‌క్తిగ‌త స‌మ‌యానికి ప్రాధాన్య‌త‌నిస్తూనే, ఉద్యోగ‌బాధ్య‌త‌ల్ని స‌వ్యంగా నెర‌వేర్చాల‌ని దీపిక అంది.

 

విశ్రాంతితో కోలుకోక‌పోతే తిరిగి ప‌నిలో శ‌క్తిని ధార‌పోయ‌డం అసాధ్య‌మ‌ని చెప్పింది. కేవ‌లం న‌టీన‌టులే కాదు ఇత‌ర‌ సిబ్బందికి కూడా నిర్దిష్ట పని గంటల అవసరాన్ని కూడా దీపిక‌ నొక్కి చెప్పింది. నిర్మాతగా, ఎక్కువ గంటలు పని చేయడం వల్ల వేగవంతమైన ఫలితాలు వస్తాయనే దానిని తాను న‌మ్మ‌ను అని తెలిపింది. సెట్లో ప‌ని షెడ్యూల్‌లను సంస్కరించాలని తాను కోరుకుంటున్న‌ట్టు దీపిక తెలిపింది.  తగినంత విశ్రాంతి చాలా అవ‌స‌రం. ఇది శ‌క్తినిచ్చి ప‌ని సామ‌ర్థ్యాన్ని, నాణ్య‌త‌ను పెంచుతుంది. ఓవర్‌టైమ్ పనిచేసే సిబ్బందికి న్యాయమైన పరిహారం ఇవ్వాల‌ని కూడా దీపిక సూచించింది.

 

హీరోలు ద‌ర్శ‌కులు ఇలాంటి వాటికి రివార్డులు పొందినా కానీ, ఇత‌ర సిబ్బందికి గుర్తింపు ఉండ‌దు. ఎక్కువ గంటలు పని చేసేది సిబ్బంది ముందుగానే సెట్లోకి రావడం.. ఆలస్యంగా వెళ్లడం వంటివి స‌రికాద‌ని దీపిక లోపాన్ని ఎత్తి చూపారు. గంటకు అదనంగా చెల్లించేలా చూసే వ్యవస్థ అవసరాన్ని దీపిక‌ నొక్కి చెప్పింది. ఇది సమానమైన పని వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొంది. 

Deepika Padukone 8-Hour Work Demand:

deepika stick to her stand on working hours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs