Advertisement
Google Ads BL

స్టార్ హీరో గ్యారేజీలో కార్ల విలువ 100కోట్లు


మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన `సీతారే జ‌మీన్ పార్` థియేట‌ర్ల‌లోకి విడుద‌లైంది. ఈ సినిమాకి పాజిటివ్ స‌మీక్ష‌లు వ‌చ్చినా ఆశించిన స్థాయి క‌లెక్ష‌న్స్ రాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. ఇది కేవ‌లం ఒక సెక్ష‌న్ ఆడియెన్ ని మాత్ర‌మే థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగింది. ఈ మూవీ ఇప్ప‌టికి సుమారు 60కోట్లు వసూలు చేయ‌గా, క‌లెక్ష‌న్స్ ప‌రంగా హైప్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

Advertisement
CJ Advs

అమీర్ ఖాన్ త‌దుప‌రి భారీ సినిమాల రూప‌క‌ల్ప‌న కోసం ప్ర‌ణాళికల్లో ఉన్నారు. ఈ స‌మ‌యంలో అత‌డి నాలుగున్న‌ర ద‌శాబ్ధాల కెరీర్ లో నిక‌ర సంప‌ద‌ల విలువ ఎంత ఉంది? అన్న‌ది ఆరా తీస్తే, జీక్యూ వివ‌రాల ప్ర‌కారం.. మొత్తం 1860 కోట్ల మేర ఆస్తుల‌ను అత‌డు కూడ‌గ‌ట్టాడు. ప్ర‌స్తుతం అందుకుంటున్న అడ్వాన్సులు క‌లుపుకుంటే, అమీర్ ఖాన్ ఆస్తులు 2026 నాటికి 1900 కోట్ల వ‌ర‌కూ పెర‌గ‌నున్నాయి.

అత‌డికి దేశ విదేశాల్లో ఆస్తులు అంత‌స్తులు ఉన్నాయి. అమెరికా బెవ‌ర్లీ హిల్స్ లోని ఇంటి విలువ సుమారు 75 కోట్లు. కాగా పాలీహిల్ (ముంబై), బాంద్రా వంటి చోట్ల అమీర్ కి సొంతంగా ఇల్లు ఉన్నాయి. అమీర్ ఖాన్ ముంబై ఆ చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాలు, ఉత్త‌ర ప్ర‌దేశ్ లోను భారీగా రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టారు. వీటి విలువ వంద‌ల కోట్లు. అలాగే సినిమాల నిర్మాణ సంస్థ ద్వారాను అత‌డికి ఆదాయం వ‌స్తోంది. ఒక్కో సినిమాకి 100కోట్ల పారితోషికం, లాభాల్లో వాటాలు అందుకునే ఈ హీరో ర‌క‌ర‌కాల వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టాడు. వ్య‌వ‌స్థాప‌కుడిగా అత‌డు విజ‌య‌ప‌థంలో ప్ర‌యాణించాడు. ఇక అమీర్ ఖాన్ కార్ గ్యారేజీలో ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌కు కొద‌వేమీ లేదు. మెర్సిడెస్ బెంజ్ ఎస్‌600 , రోల్స్ రాయిస్ స‌హా ప‌ది ర‌కాల బ్రాండెడ్ కార్లు అత‌డి గ్యారేజీలో ఉన్నాయి. వీటి విలువ సుమారు 100 కోట్లు పైమాటే. ఇది బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైనది. ఈ లగ్జరీ కారు ధర రూ.6.95 కోట్ల నుండి రూ.7.95 కోట్ల మధ్య ఉంటుంది ఇక బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారూఖ్ 6300 కోట్ల ఆస్తుల‌తో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌గా, అమీర్ ఖాన్ టాప్ 10 సంపాద‌క‌ హీరోల్లో ఒక‌డిగా ఉన్నాడు.

జీక్యూ ఇండియా అందించిన డీటెయిల్స్ ప్ర‌కారం...అమీర్ ఖాన్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఖ‌రీదు -రూ. 5.25 -6.8 కోట్లు, కాగా మెర్సిడెస్ బెంజ్ ఎస్‌-600 - ఖ‌రీదు రూ. 10.5 కోట్లు.  రేంజ్ రోవర్ వోగ్ - రూ. 2.26 కోట్ల విలువ క‌లిగి ఉంది. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ - ఐకానిక్ 0007 నంబర్ ప్లేట్‌తో కొన్నాడు. దీని ధర రూ. 3.21 -3.41 కోట్లు. బీఎండ‌బ్ల్యూ  6-సిరీస్ కార్ వెల‌ రూ. 65 లక్షలు. టయోటా వెల్‌ఫైర్ & ఫార్చ్యూనర్ చాలా కాలంగా అమీర్ వాడుతున్న కార్లు. మహీంద్రా XUV500 & టయోటా ఇన్నోవాల‌ను అత‌డి రోజువారీ కార్య‌క‌లాపాల‌కు ఉప‌యోగిస్తాడు. అత‌డు అత‌డి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి కానుక‌గా ఇచ్చిన కార్ల విలువ సుమారు 30 కోట్లు పైగానే ఉంటుంద‌ని స‌మాచారం.

Aamir Khan owns a luxury cars collection worth 100 crores :

&nbsp; <p class="MsoNormal">Aamir Khan Luxury Car Collection &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs