Advertisement
Google Ads BL

చిరు ఇక మీరే మిగిలారు


సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కారు. నందమూరి బాలకృష్ణ వరస విజయాలతో కూసింత టాప్ లో ఉన్నారు. అఖండ దగ్గర నుంచి డాకు మహారాజ్ వరకు వరస విజయాలతో బాలయ్య స్పీడుకు బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నారు. ఇప్పుడు కూడా అఖండ 2 తాండవం తో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

మరోపక్క సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో విక్టరీ వెంకటేష్ 300 కోట్ల మార్క్ ని సెట్ చేసి సీనియర్ హీరోలకు ఛాలెంజ్ విసిరారు. సంక్రాంతికి వస్తున్నాం తో 300కోట్ల బెంచ్ మార్క్ తో వెంకటేష్ అందరికన్నా హై రేంజ్ లో ఉన్నారు. ఇక ఇప్పడు మరో సీనియర్ హీరో నాగార్జున కుబేర చిత్రం తో బిగ్ పాన్ ఇండియా హిట్ కొట్టారు. 

కుబేర మల్టీస్టారర్ అయితేనేమి అందులో నాగార్జున రోల్ అందరికి కనెక్ట్ అవుతుంది. కుబేర ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ముగ్గురు సీనియర్ హీరోలైన బాలయ్య, వెంకీ, నాగ్ ఇలా సక్సెస్ ట్రాక్ లో కనిపిస్తే చిరు ఒక్కరే మిగిలారు. అదే చెబుతున్నారు నెటిజెన్లు కూడా.. చిరు మీరే మిగిలారు అని. 

మెగాస్టార్ వరస సినిమాలు చేస్తున్నారు కానీ.. ఆయనకు అద్భుతమైన సక్సెస్ మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం చిరు నటించిన విశ్వంభర విడుదల విషయంలో మెగా కన్ఫ్యూజన్ నడుస్తుంది, #Mega 157 తో అనిల్ రావిపూడి తో కలిసి మెగాస్టార్ జర్నీ స్టార్ట్ చేశారు. మరి ఈ చిత్రంతో చిరు ఎలాగైనా రికార్డ్ క్రియేట్ చేసే హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. 

Megastar Chiranjeevi:

Tollywood Seniors Dominate Box Office Like Never Before!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs