Advertisement
Google Ads BL

బాలయ్య ను మక్కీకి మక్కీ దించారు


నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం జన నాయగన్ గా రీమేక్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆతర్వాత భగవంత్ కేసరిలోని ఒక్క ఎపిసోడ్ ని మాత్రమే జన నాయగన్ కోసం తీసుకున్నారు, దాని కోసమే భగవంత్ కేసరి మేకర్స్ కి కోట్లు చెల్లించారనే ప్రచారం జరిగింది. 

Advertisement
CJ Advs

అయితే ఈరోజు జూన్ 22 తలపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా జన నాయకుడు టీజర్ విడుదల చేశారు. అందులో విజయ్ పోలీస్ గా, అలాగే కుర్చీలో కూర్చున్న సీన్ చూస్తే భగవంత్ కేసరిలోని బాలకృష్ణ ని మక్కీకి మక్కీ దించేశారు అనిపించేలా ఉంది. విజయ్ ఖాకీ డ్రెస్ లుక్ చూస్తుంటే భగవంత్ కేసరిలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్ గుర్తుకు రావడం సహజం. దానితో జన నాయగన్ భగవంత్ కేసరికి రీమేకనే సందేహాలు మరింత బలపడ్డాయి. 

అలాగే కత్తి తిప్పుతూ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత విజయ్ కుర్చీలో కూర్చున్న లుక్ అంతా బాలయ్య కుర్చీలో కూర్చున్న లుక్ ను పోలి ఉంది, ఇది రీమేక్ కాదంటే ఎవరు ఒప్పుకోరు అంటూ నందమూరి అభిమానులు మరోసారి జన నాయగన్ పై రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో భగవంత్ కేసరి-జన నాయగన్ పోస్టర్స్ పక్క పక్కన పెట్టి మరీ చూడండి అంటూ చూపిస్తున్నారు. 

Jana Nayagan First Roar out for Vijay birthday:

Jana Nayagan—reportedly a remake of Bhagavanth Kesari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs