Advertisement
Google Ads BL

మినీ రివ్యూ : కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2


కేరళ క్రైమ్ ఫైల్స్ మినీ రివ్యూ  

Advertisement
CJ Advs

క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ థ్రిల్లర్స్ కి థియేటర్స్ లో కన్నా ఓటీటీలలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందులోను మలయాళం నుంచి వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్లుకు అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అలా ఈ ఏడాది మలయాళం నుంచి వచ్చిన ఐడెంటిటీ, పని, రేఖా చిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, తుడరుమ్ లాంటి చిత్రాలు ఆ కోవకే చెందుతాయి. ఇప్పుడు మళయాళం నుంచి వచ్చిన మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్1 సక్సెస్ తర్వాత ఇప్పుడు కేరళ క్రైమ్ ఫైల్స్ 2 జియో ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. మరి కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ తో ప్రేక్షకులను కట్టిపడేసిందో, లేదో మినీ సమీక్షలో చూద్దాం.. 

కేరళ క్రైమ్ ఫైల్స్-2 మినీ స్టోరీ:

కేరళలోని త్రివేండ్రమ్ లో పోలీసులు ఒక కేసు విషయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటారు. అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న అంబిలిరాజు ఓ నేరస్తుడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు తీసుకొచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు, అదే సమయంలో డాగ్ స్క్వాడ్ లోని ఒక డాగ్ అనారోగ్యం బారిన పడుతుంది. ఇక అక్కడ్నుంచి అంబిలిరాజు మిస్సింగ్ కేసుని ఛేదిస్తూ డాగ్ స్క్వాడ్ డాగ్ చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం కొచ్చి, త్రిసూర్, అలువ చుట్టుపక్కల జరుగుతుంది. అసలు అంబిలిరాజు ఏమయ్యాడు, ఆ రిటైర్ డాగ్ కి అంబిలిరాజు మిస్సింగ్ కి ఏమిటి సంబంధం అనేది కేరళ క్రైమ్ ఫైల్స్ 2 స్టోరీ. 

కేరళ క్రైమ్ ఫైల్స్-2 స్రీన్ ప్లే:

క్రైమ్ థ్రిల్లర్స్ కి ట్విస్ట్ లు, బిగి సడలని అంటే నరాలు తెగిపోయే ఉత్కంఠ, ఆసక్తికర మలుపులే ప్రాణంగా నిలుస్తాయి. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 సక్సెస్ అవడానికి అవే కారణమయ్యాయి. కానీ సీజన్ 2 లో మాత్రం అవే మిస్ అయ్యాయి. అంబిలిరాజు మిస్సింగ్ తర్వాత పోలీసులు తాపీగా కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో పెద్దగా ట్విస్ట్ లు కానీ, నరాలు తెగిపోయే ఉత్కంఠ కానీ కనిపించదు. చిన్న చిన్న క్లూస్ తో కొచ్చి నుంచి త్రిసూర్, అక్కడినుంచి అలువ ఇలా పోలీసులు వెళుతూ ఉంటారు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే యాక్షన్ తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టుగా కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 సాగుతుంది. అంబిలిరాజు ఉన్నాడా, చనిపోయాడా అనేది చివరివరకు సస్పెన్స్ క్రియేట్ చేసినా.. దాని వరకు వెళ్ళడానికి పోలీసులు బాగా టైమ్ తీసుకున్నారు. ఇక డాగ్ స్క్వాడ్ లోని రిటైర్ అయిన డాగ్ మరణాన్ని కూడా  చాలా సింపుల్ గా చూపించేసారు. ఎక్కడా ఎమోషన్స్ కానీ, పోలీసుల శ్రమ కానీ కనిపించదు. జస్ట్ మూడు ఎపిసోడ్స్ లో ఫినిష్ అవ్వాల్సిన కథను ఆరు ఎపిసోడ్స్ వరకు సాగదీశారు. అంతేకాదు ఆ పోలీసులు, పోలీస్ స్టేషన్స్, ఆ ఏరియాలు ఇవన్నీ ఆడియన్స్ ను గందరగోళానికి గురి చేస్తాయి. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 చూసేందుకు నీట్ గా, స్లో గా అలా అలా సాగుతుంది. కాకపోతే అంత ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా మాత్రం కనెక్ట్ అవ్వదు. 

కేరళ క్రైమ్ ఫైల్స్ లో నటించిన నటులు, హేషం అబ్దుల్ వాహెబ్ BGM, అందమైన లొకేషన్స్ అందంగా చూపించిన జితిన్ ఫొటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని హైలెట్. కానీ కథే నీరసం తెప్పించింది. మహేశ్ భువనేంద్ ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది. 

క్రైమ్ థ్రిల్లర్స్ ను, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవాళ్లు మాత్రం ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ని ఓసారి వీక్షించవచ్చు. 

Kerala Crime Files Season 2 Mini Review:

Kerala Crime Files Season 2 Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs