Advertisement
Google Ads BL

పెద్ది మాసివ్ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రంపై పాన్ ఇండియా మార్కెట్ లో ఎంతగా అంచనాలున్నాయో, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 100కోట్లకు పైగా డిజిటల్ డీల్ చేసుకోవడం తోనే అర్ధమైంది. పెద్ది క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అనేది. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రం పై ఏ అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లోనే వైరల్ అవుతుంది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం పెద్ది షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌ లో జరుగుతుండగా.. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు గూస్ బంప్స్ తెప్పించేలాంటి ట్రైన్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి యాక్షన్ ఘట్టాన్ని చూసి ఉండరని సమాచారం. టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ.. ఈ ట్రైన్ ఎపిసోడ్ తెరకెక్కుతుండగా.. అది భారతదేశంలో యాక్షన్ చిత్ర నిర్మాణంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తుంది అంటున్నారు. 

ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సన్నివేశం కోసం అద్భుతమైన భారీ సెట్‌ను రూపొందించారని.. ఈ ట్రైన్ స్టంట్ కోసం వేసిన సెట్ చూడటానికి ఓ విజువల్ వండర్‌లా ఉందని సమాచారం. రామ్ చరణ్ కెరీర్ లోనే ఇలాంటి మాసివ్ యాక్షన్ సీన్ చెయ్యలేదు, పెద్ది లోనే మొదటిసారిగా రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారని, ఈ స్టంట్ సీక్వెన్స్ పెద్ది చిత్రానికే హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు. 

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్ విలన్ గా, జగపతిబాబు, ముఖుల్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించబోతుండగా.. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Peddi Massive Train Action Sequence:

First-of-its-kind train action sequence being shot for Peddi 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs