Advertisement
Google Ads BL

చైతు తో కలిసే సమస్యేలేదంటున్న సమంత


నాగ చైతన్య-సమంత విడిపోయాక వారిద్దరూ కలిసిపోవాలని అభిమానులు ఎంతగా కోరుకున్నారో, ఆఖరికి కలవాలని పూజలు కూడా చేసారు. అది జరగకపోయేసరికి వారిద్దరిని ఒకే స్క్రీన్ పై చూడాలని, ఒకే స్టేజ్ పై చూడాలని చాలామంది అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇంతవరకు చైతు-సమంత డివోర్స్ అయ్యాక ఫేస్ టు ఫేస్ కలిసింది లేదు. సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్ట్ లు తప్ప ఒకరిపై ఒకరు నిందలు కూడా వేసుకోలేదు. 

Advertisement
CJ Advs

అయితే రీసెంట్ గా నాగ చైతన్య-సమంత ఒకే వేదికపై కలిసే అవకాశం వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. నాగ చైతన్య-సమంతల కెరీర్ లో ఆరంభంలో కీలకంగా నిలిచిన ఏ మాయ చేసావే చిత్రం వచ్చే నెల 18 న రీ-రిలీజ్ అవుతుంది. ఆ సందర్భంగా చైతు-సమంతలు కలిసి ఏమాయ చేసావే చిత్రాన్ని ప్రమోట్ చేస్తారని ప్రచారం హోరందుకుంది. అయితే ఈ రూమర్స్ పై సమంత ఫుల్ గా క్లారిటీ ఇవ్వడమే కాదు చైతు తో కలిసే సమస్యే లేదంటుంది. 

తను ఏమాయ చేసావే చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడం లేదని చెప్పింది, ఈ వార్తలు ఎక్కడనుండి పుడుతున్నాయో అర్ధం కావడం లేదు.. ఆ సినిమాలో నటించిన జంటను కలిసి చూడాలని ప్రేక్షకులకు ఇష్టం ఉండొచ్చు. కానీ ప్రేక్షకుల కోసం మేము జీవించలేం కదా అని సమంత నాగ చైతన్య తో కలిసి ఒకే వేదికపై కనిపించవచ్చనే రూమర్స్ కి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది.

Samantha On Ye Maya Chesave Re-Release Promotions:

Samantha Ruth Prabhu refutes rumours of promoting Ye Maaya Chesave re-release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs