Advertisement
Google Ads BL

సీఎంతో సినీపెద్ద‌ల భేటీ మిస్సింగ్..రియ‌ల్ రీజ‌న్!


ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖుల కీల‌క‌ స‌మావేశం వాయిదా ప‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అంటే..! కొంద‌రు సినీ తార‌ల బిజీ షెడ్యూళ్ల కార‌ణంగా వాయిదా ప‌డిందంటూ ప్ర‌చారం సాగింది. నిన్న‌టిరోజున (ఆదివారం) జ‌ర‌గాల్సిన కీల‌క‌మైన భేటీ అర్థాంత‌రంగా వాయిదా ప‌డ‌టం కొంద‌రిలో కల‌త‌కు కార‌ణ‌మైంది.

Advertisement
CJ Advs

అయితే ఈ వాయిదాకు కార‌ణం సినీతారల బిజీ షెడ్యూళ్లు ఒక్క‌టే కాదు.. ఇటు రాజ‌కీయ నాయ‌కులు కూడా బిజీబిజీగా ఉండ‌ట‌మే వాయిదాకు అస‌లు కార‌ణం అని తెలిసింది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర మంత్రితో కీల‌క స‌మావేశం కోసం వెళ్లారు. వాణిజ్య పన్ను సంస్కరణలపై చర్చించడానికి ఆయన వెలగపూడిలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో భేటీ అయ్యారు. ఆయ‌న ఇత‌రుల‌కు అందుబాటులో ఉండే ప‌రిస్థితి లేదు. 

అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` షూటింగ్ లో పాల్గొనేందుకు విదేశాల‌కు వెళ్లారు. అందువ‌ల్ల కీల‌క‌మైన నాయ‌కులు ఇద్ద‌రూ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే సినీపెద్ద‌ల భేటీ వాయిదా ప‌డింద‌ని తెలిసింది. రాజ‌కీయ నాయ‌కుల షెడ్యూళ్ల‌ను బ‌ట్టి సినీపెద్ద‌ల డేట్లు అడ్జ‌స్ట్ చేసుకోవడ‌మే వారి ముందున్న విధి. ఈ విష‌యంలో ప్రోటోకాల్ మార‌దు!

Missing meeting of film celebrities with AP CM..real reason!:

AP CM–Tollywood Bigwigs Meet Deferred
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs