Advertisement
Google Ads BL

కన్నప్ప: విష్ణు అలా ప్లాన్ చేయొచ్చుగా


కన్నప్ప చిత్రాన్ని మంచు విష్ణు తన శాయశక్తులా ప్రమోట్ చేస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ అనడమే కాదు, అందుకు తగిన కష్టాన్ని మంచు విష్ణు పడుతున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ కుమార్ లాంటి స్టార్స్ నటించారు. వారు చేసినవి గెస్ట్ పాత్రలే అయినా.. పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించారు. 

Advertisement
CJ Advs

దానితో కన్నప్ప పై అంచనాలు పెరిగాయి. అయితే కన్నప్ప ప్రమోషన్స్ కోసం మంచు విష్ణు జర్నలిస్టులను ఎంచుకుని అందరితో కలిసి ఇంటర్వూస్ చేసారు. అప్పుడే మంచు విష్ణు కన్నప్ప కోసం ప్రభాస్, మోహ లాల్, అక్షయ కుమార్ లు ప్రమోట్ చెయ్యడానికి వస్తారా అనే హోప్స్ అందరిలో మొదలయ్యాయి. 

అందుకే మంచు విష్ణు కి వారంతా ఓ సలహా ఇస్తున్నారు. విష్ణు జర్నలిస్ట్ లను కూర్చోబెట్టి ఇంటర్వూస్ ఇవ్వడం కాదు.. ప్రభాస్-మోహన్ లాల్-అక్షయ్ కుమార్ లను తీసుకొచ్చి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే బావుంటుంది. మోహన్ లాల్, ప్రభాస్-అక్షయ్ కుమార్ లను ఒకే స్టేజ్ పై కూర్చోబెట్టి మంచు విష్ణు తో కలిసి కన్నప్ప విషయాలు మాట్లాడితే.. విపరీతమైన క్రేజ్ వస్తుంది. 

వారెవరూ స్పెషల్ గా ఒక్కొక్కరిగా కన్నప్ప ను ప్రమోట్ చేసేందుకు ఇంటర్వూస్ ఇవ్వక్కర్లేదు, అలా ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే పాన్ ఇండియా మొత్తం సరిపోతుంది అంటూ ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మంచు విష్ణు ప్లాన్స్ ఏమిటో చూడాలి. 

Kannappa: Vishnu can plan like that:

Kannappa promotional talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs