Advertisement
Google Ads BL

అబ్బబ్బే అది నా లాస్ట్ సినిమా కాదు-ఆమిర్


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత నే తన లాస్ట్ మూవీ అని అర్ధం వచ్చేలా మాట్లాడడంతో.. మహాభారత తర్వాత ఆమిర్ ఖాన్ సినిమాలు చెయ్యరని ఆయన అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. అందులోను ఆమిర్ ఖాన్ మహాభారత స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చెయ్యడంతో మహాభారత తర్వాత ఆయన ఇక కనిపించరనే ప్రచారం జరిగింది. 

Advertisement
CJ Advs

ఆయన నిర్మాణంలో హీరోగా నటించిన సితారే జమీన్ పర్ విడుదల సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో మహాభారత తన లాస్ట్ ఫిలిం కాదు, నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ అమర్ ఖాన్ వివరణ ఇచ్చారు. మహాభారతం నా చివరి చిత్రం కాదు. నా సమాధానాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.

సదరు యాంకర్ మీరు ఏదైనా సినిమా తర్వాత నటనకు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందా అని అడిగితే దానికి సమాధానమిచ్చాను. ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చే ఏ పాత్రనైనా చేసాక అలా అనిపిస్తే చేస్తాను అన్నాను. దానితో అందరూ ఆ పాత్ర మహాభారతంలోనిదే అని, ఆ తర్వాత నేను ఇక నటించనని చాలామంది అనుకున్నారు. కానీ నేను చెప్పిన ఆన్సర్ ని జాగ్రత్తగా వినాలని అర్ధంచేసుకోవాలని కోరుతున్నా అంటూ ఆమిర్ చెప్పుకొచ్చారు. 

Aamir Khan Shuts Down Retirement Buzz:

Aamir Khan reacts to the buzz about Mahabharat being his last film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs