అతడు టాలీవుడ్, మాలీవుడ్ లో చాలా ఫేమస్ హీరో. వరుస బ్లాక్ బస్టర్లతో స్టార్ డమ్ ని వేగంగా పెంచుకున్న హీరో. తెలుగులో ఇటీవల వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. కెరీర్ సంగతి ఎలా ఉన్నా, ఈ యువహీరో ఎఫైర్లు, స్నేహాల గురించి ఎప్పుడూ చర్చ సాగుతుంది. అతడు కొన్నేళ్ల క్రితం పరిశ్రమలోని ఒక రింగుల జుత్తు సుందరితో డేటింగ్ చేసాడు. అది అతడి ఫ్యామిలీ లైఫ్లో గొడవలకు కారణమైందని కూడా గుసగుసలు వినిపించాయి. ఆ హీరోయిన్ ఆ తర్వాత పూర్తిగా పెళ్లికి వ్యతిరేకంగా మారింది.
ఇప్పుడు ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారు ఉన్నారు. కానీ ఇటీవల అతడు పాపులర్ మలయాళ హీరో కుమార్తెతో చనువుగా ఉండటం చర్చకు వచ్చింది. ఆ ఇద్దరి స్నేహం అన్నివేళలా పరిశ్రమలో డిబేట్ కి వస్తున్నా.. అసలేం జరుగుతోంది? అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ యంగ్ హీరో, ఆ యువ నటికి క్రేజీ ఆఫరిచ్చాడు. ఏకంగా తనను సూపర్ గాళ్ ని చేసేస్తూ లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో నటింపజేస్తూ, ఒక భారీ సినిమాని కూడా సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.
ఇది ఆశ్చర్యకరమైన క్షణం అని అతడి సన్నిహితులు భావిస్తున్నారు. స్నేహం కోసం భారీగా డబ్బు వెచ్చించి సాహసం చేస్తున్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరి మధ్యా ఉన్నది కేవలం స్నేహమేనా? ఇంకేదైనానా? స్నేహం కోసమే కోట్లాది రూపాయలు వ్యక్తిగతంగా రిస్క్ చేస్తూ పెట్టుబడి పెడుతున్నాడా? అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. ఇటీవలే ఈ సూపర్ గాళ్ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఆ హీరో ఎవరు? యువహీరోయిన్ ఎవరు? అన్నది అప్రస్తుతం. ఆ ఇద్దరి మధ్యా స్నేహం ఎలాంటిది? అనేదానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.