Advertisement
Google Ads BL

ప‌దే ప‌దే క్రియేటివిటీలో వేలు పెట్టాడు


సౌత్ లో ఒక బ‌డా ద‌ర్శ‌క‌నిర్మాత‌కు, ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్న ప్ర‌ముఖ న‌టుడికి మ‌ధ్య కొన్నేళ్ల క్రితం జ‌రిగిన గొడ‌వ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి. ఆ ఇద్ద‌రి న‌డుమా సృజ‌నాత్మ‌క విభేధాలు తారా స్థాయికి చేరుకోవ‌డంతో ఆ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. చివ‌రికి హీరోతో కోఆప‌రేట్ చేసేందుకు నిర్మాత ప్ర‌య‌త్నించినా కానీ, ఆ సినిమా డిజాస్ట‌ర్ ఫ‌లితాన్ని అందుకుంది. అది రిలీజ్ కి ముందు  చాలా ఇబ్బందులు త‌లెత్తాయి.

Advertisement
CJ Advs

అయితే ఈ ప్రాజెక్ట్ ఇలా డిజాస్ట‌ర్ అవ్వ‌డానికి కార‌ణం జాతీయ అవార్డుల హీరో ప‌దే ప‌దే ఫింగ‌రింగ్ చేయ‌డ‌మేన‌ని ఆ నిర్మాత వాపోయాడు. సెట్లో చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప‌దే ప‌దే స్క్రిప్టును మార్చేవాడు. సృజ‌నాత్మ‌కంగా అత‌డితో ప‌ని చేయ‌డం చాలా ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారింది అని చెప్పాడు. చివ‌రికి ఎడిటింగ్ ద‌శ‌లో అయినా టిఫిక‌ల్ ఎడిట్ క‌ట్ ల‌తో సినిమాని కాపాడాల‌ని ప్ర‌య‌త్నించినా, దానికి కూడా అత‌డు అంగీక‌రించ‌లేదు. అస‌లు అత‌డితో ప‌ని చేయ‌డం అంటేనే హ‌ద్దుమీరిన‌ ఖ‌ర్చు తో కూడుకున్న వ్య‌వ‌హారం .. తొంద‌ర‌గా ఏదీ తేలదు! అని చెప్పాడు.

చివ‌రికి ఈ సినిమా ఫ‌లితం తారుమారు అయితే, 30కోట్ల రేంజులో మ‌రో ప్రాజెక్ట్ చేయ‌డానికి స‌హ‌క‌రిస్తాన‌ని, రిక‌వ‌రీ చేసుకోవ‌చ్చ‌ని ఆ హీరో హామీ ఇచ్చాడు. కానీ చివ‌రికి తాను తెచ్చిన ఓ క‌థ‌ను రిజెక్ట్ చేసాడ‌ని, పైగా త‌న‌ను నిందించాడ‌ని అన్నారు. మొత్తానికి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సృజ‌నాత్మ‌క విభేధాలు అన‌వ‌స‌ర గొడ‌వ‌లుగా మారాయి. దీంతో వారి రిలేష‌న్ కూడా చెడింది. ఈ గొడ‌వ అంతా ఎవ‌రి మ‌ధ్య అంటే.. క‌మ‌ల్ హాస‌న్- లింగుస్వామి మ‌ధ్య‌. ఉత్త‌మ విల‌న్ సినిమా స‌మ‌యంలో వారి మ‌ధ్య గొడ‌వ‌లు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్ప‌టికీ వారు దూరంగానే ఉన్నారు. 

Kamal Haasan vs Lingusamy:

When Lingusamy revealed how Kamal Haasan constant script changes turned Uttama Villain
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs