Advertisement
Google Ads BL

కోట శ్రీ‌నివాస‌రావుకు ఏమైంది


తెలుగు చిత్ర‌సీమకు సుదీర్ఘ కాలం న‌టుడిగా సేవ‌లందించిన ప్ర‌ముఖుడు కోట శ్రీ‌నివాస‌రావు. ద‌క్షిణాది స‌హా బాలీవుడ్ లోను న‌టించిన సీనియ‌ర్ అత‌డు. కెరీర్ లో దాదాపు 750 పైగా చిత్రాల్లో న‌టించిన కోట శ్రీ‌నివాస‌రావు తొమ్మిది నంది అవార్డుల‌ను అందుకున్నారు. అయితే కోట శ్రీ‌నివాస‌రావు గ‌త రెండేళ్లుగా సినిమాల్లో న‌టించ‌డం లేదు. ఎక్క‌డా బ‌య‌ట కూడా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణ‌మేమిటో అభిమానుల‌కు తెలియ‌దు.

Advertisement
CJ Advs

అయితే కోట ఇటీవ‌ల వృద్ధాప్య సంబంధ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్నారని తాజాగా బండ్ల గ‌ణేష్ షేర్ చేసిన ఫోటో చెబుతోంది. ఇటీవ‌ల కోట‌ను ఆయ‌న ఇంట్లో సంద‌ర్శించిన గ‌ణేష్ .. చాలా కాలం త‌ర్వాత ఇలా కోట బాబాయ్‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. అయితే గ‌ణేష్ ఈ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసిన వెంట‌నే కోట అభిమానులు దానిని వైర‌ల్ చేస్తూ ఆందోళ‌న‌ను వ్య‌క్త‌ప‌రిచారు. వెట‌ర‌న్ న‌టుడు బాగా బ‌క్క చిక్కి శ‌ల్య‌మై క‌నిపించారు. ఆయ‌న రంగు రూపం మారిపోయింది. 

పైగా కాలికి కట్టు క‌నిపించింది. మ‌రో కాలు బొబ్బ‌లు తేలి క‌నిపించింది. అయితే వ‌య‌సు 70 పైబ‌డిన ఆయ‌న సుగ‌ర్ బాధితుడు. దాంతో పాటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని చెబుతున్నారు. ప్రస్తుతం విశ్రాంత జీవితంలో తీవ్ర‌మైన‌ అనారోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవ‌డం ఇబ్బందిక‌రం. ఆయ‌న‌కు ఏమైందో అంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

Fans Concerned Over Kota Srinivasa Rao Health:

Kota Srinivasa Rao has not been in front of the camera for a long time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs