Advertisement
Google Ads BL

తమ్ముడు లైన్ లోకి.. కింగ్‌డమ్ కన్ఫ్యూజన్ లోకి


నిన్నటివరకు నితిన్ తమ్ముడు జులై 4 న వస్తుందో, లేదో అనే కన్ఫ్యూజన్ నడిచింది. కారణం తమ్ముడు డేట్ అనౌన్స్ చేసాక టీమ్ మొత్తం సైలెంట్ అయ్యింది. నితిన్, వేణు శ్రీరామ్, దిల్ రాజు ఇలా అందరూ తమ్ముడు చిత్రం జులై 4 అంటూ డిఫ్రెంట్ గా విడుదల తేదీని అనౌన్స్ చేసారు... తీరా కింగ్ డమ్ జులై 4 అన్నాక తమ్ముడు కామైపోయాడు. దానితో తమ్ముడు రిలీజ్ వాయిదా అనే టాక్ నడిచింది. 

Advertisement
CJ Advs

తాజాగా తమ్ముడు టీం సడన్ గా లైన్ లోకి వచ్చింది. జులై 4 న తమ్ముడు ఖచ్చితంగా వస్తుంది, విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు, కావాలంటే ట్రైలర్ రిలీజ్ చేస్తే మీకు అనుమానాలు తొలుగుతాయి అంటూ తమ్ముడు లో నటించిన లయ అండ్ టీమ్ మళ్లీ క్లారిటీ ఇచ్చింది. మరి తమ్ముడు లైన్ లోనే ఉంది, కానీ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మాత్రం కన్ఫ్యూజన్ లో కనిపిస్తుంది. 

నిర్మాత నాగవంశీ కింగ్ డమ్ విడుదల వాయిదాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టి ఎట్టి పరిస్టితుల్లో కింగ్ డమ్ జులై 4 ఉంటుంది అన్నారు, కానీ ఇన్ సైడ్ టాక్ ఏమిటంటే కింగ్ డమ్ వాయిదా తప్పదు అని. జులై 4 నుంచి కింగ్ డమ్ ఆగష్టు 1 కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అనే ముచ్చట మొదలైంది. 

కింగ్ డమ్ కి మార్చి లో మొదలైన వాయిదాల పర్వం ఇప్పటికి ఆగలేదు. జులై 4 న రిలీజ్ ఫిక్స్ అయ్యాక కొంత రీ షూట్ చేయాల్సి వచ్చింది.. దానితో ఇప్పుడు జులై 4 నుంచి కింగ్ డమ్ తప్పుకోక తప్పలేదు అనే మాట వినబడుతుంది.  

Thammudu Returns To July 4th:

Kingdom postponed to July 4th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs