Advertisement
Google Ads BL

కన్నప్పలో అందుకే నటించలేదు-మంచు లక్ష్మి


కన్నప్ప సినిమా సెట్ పైకి వెళ్ళాక మంచు ఫ్యామిలిలో జరిగిన గొడవలు అన్ని మీడియా ముఖంగా అందరికి తెలిసినవే. మంచు అన్నదమ్ములైన మంచు విష్ణు-మంచు మనోజ్ ల నడుమ ఆస్తి వ్యవహారం  రచ్చ రచ్చ అయ్యింది. రోడ్డెక్కి మరీ తన్నుకునేవరకు వచ్చింది వ్యవహారం. మంచు మనోజ్ పెళ్లి అప్పటినుంచే మంచు ఫ్యామిలిలో విభేదాలు నెలకొన్నాయి. మంచు లక్ష్మి తమ్ముడు మనోజ్ వైపే ఉంది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత మంచు విష్ణు-మంచు మనోజ్ ల నడుమ ఆస్తి గొడవలు మరింత ముదిరాయి. ఆ తర్వాత మంచు లక్ష్మి ఎవరి సైడ్ ఉందొ.. ఎవరికి ఫేవర్ గా ఉందొ అనేది ఎవ్వరికి క్లారిటీ లేదు, ఈలోపే మంచు లక్ష్మి కన్నప్ప చిత్రంలో ఎందుకు నటించలేదు అనే విషయంలో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. 

తాజాగా మంచు లక్ష్మి తానెందుకు కన్నప్ప చిత్రంలో నటించలేదో అనే విషయాన్ని రివీల్ చేసింది. తాను కన్నప్ప లో నటిస్తే మిగతా ఎవరూ కనిపించరంటూ సరదాగా కామెంట్ చేసింది. అసలు కన్నప్పలో తనకు సరిపోయే పాత్ర లేదని భావిస్తున్నానని, అందుకే విష్ణు తనకు అవకాశం ఇవ్వలేదని అనుకుంటున్నానని చెప్పింది.  

ఒకవేళ తాను పోషించగలిగిన పాత్ర ఉంటే విష్ణు అవకాశం ఇచ్చేవాడేమోనని, ఆ విషయం మాత్రం మీరు విష్ణునే అడగాలని చెప్పింది. నేను కన్నప్పలో గనక నటిస్తే అది ఫ్యామిలీ మూవీ అంటారు. కన్నప్పలో తనకు నటించే అవకాశం ఇవ్వనంత మాత్రాన విష్ణుకు తన మద్దతు లేదని అనుకుంటున్నారని, అది నిజం కాదని, తన మద్దతు విష్ణు కు ఎప్పుడు ఉంటుంది అని మంచు లక్ష్మి స్పష్టం చేసింది. 

Manchu Lakshmi on Kannappa and Vishnu:

Manchu Lakshmi Revealed Why Not She Act in Kannappa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs