నిజమే పవన్ కళ్యాణ్ కాస్త దయతలచి కోపరేట్ చెయ్యాలే కానీ.. ఆయన నటించే సినిమాలు ఎంత సేపు పూర్తవుతాయి. కేవలం పది పదిహేను రోజులున్న షూటింగ్స్ ని పవన్ కళ్యాణ్ రాజకీయాల వలన పక్కనపెట్టడంతో ఆయన తో సినిమాలు చేసిన నిర్మాతలు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పాలయ్యారు. ఎట్టకేలకు పవన్ రంగంలోకి దిగారు.
రావడం రావడం హరి హర వీరమల్లు కంప్లీట్ చేసారు, ఇప్పుడు OG సెట్ లోకి వెళ్లారు, సుజిత్ పక్కా స్క్రిప్ట్ తో పవన్ ఎప్పుడొస్తే అప్పుడు చకచకా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. OG లోకి పవన్ ఎంటర్ అవడమే తరువాయి చాలా స్పీడు గా ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసేసాడు దర్శకుడు సుజిత్. పవన్ కళ్యాణ్ ముంబై షెడ్యూల్ లో లీకైన ఫొటోస్ లో వింటేజ్ లుక్ లో కనిపించారు.
ఇక ముంబై షెడ్యూల్ కంప్లీట్ అవడంతో సుజిత్ వెంటనే విజయవాడలో మరో షెడ్యూల్ కాదు కాదు చివరి షెడ్యూల్ ప్లాన్ చేసేసాడు. ఇక్కడ విజయవాడలో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ లెక్కన సెప్టెంబర్ 25 న ఎలాంటి అడ్డంకి లేకుండా OG థియేటర్స్ లోకి వచ్చేస్తుంది.
మరోపక్క పవన్ కళ్యాణ్ ఈ నెల రెండో వారం నుంచి ఉస్తాద్ భగత్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. హరీష్ శంకర్ పవన్ రాకకై వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆయన రావడమే చకచకా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు, పవన్ ఇలా కోపరేట్ చేస్తే నిర్మాతలకు కష్టాలు ఉండవు.