Advertisement
Google Ads BL

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన షైన్‌


రీసెంట్ గా డ్రగ్ కేసులో ఇరుక్కున్న మలయాళ విలక్షణ నటుడు షైన్‌ టామ్‌ చాకో రోడ్ యాక్సిడెంట్ లో తండ్రిని కోల్పోవడమే కాదు, అదే యాక్సిడెంట్ లో అతనికి తీవ్ర గాయాలవడం కలకలం సృష్టించింది. షైన్‌ టామ్‌ చాకో ఫ్యామిలీకి సేలం–బెంగళూరు జాతీయ రహదారిపై ఈరోజు అంటే శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

Advertisement
CJ Advs

ఈ యాక్సిడెంట్ లో షైన్‌ టామ్‌ చాకో తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో షైన్‌ టామ్‌ చాకో, ఆయన సోదరుడు, మేనేజర్ అనీస్ కూడా ఉన్నారు. వారికి కూడా ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే.. శుక్రవారం ఉదయం షైన్ టామ్ చాకో తన కుటుంబంతో కలిసి తండ్రి సీపీ చాకోకు హెల్త్ చెకప్ కోసం త్రిసూర్‌ నుండి బెంగళూరుకు బయలుదేరగా.. వారి వాహనం పాలకొడ్‌లోని పయ్యూర్ వద్దకు రాగానే రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షైన్ తండ్రి సీపీ అక్కడికక్కడే మృతి చెందారు. షైన్, ఆయన సోదరుడు జో జాన్ చాకో, అలాగే కారు నడిపిన నటుడి మేనేజర్ అనీస్ గాయాలతో పాలకొడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. 

Shine Tom Chacko father dies in car accident, actor injured:

Malayalam actor Shine Tom Chacko father passes away in car accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs