Advertisement
Google Ads BL

జగన్ చుట్టూ జనం.. చూసి మోసపోకండి


గతంలో జగన్ ఎప్పుడు బయటికొచ్చినా ఆయన చుట్టూ జనం కాదు, పరదాలు కనిపించేవి. కానీ ఓడిపోయాక చాలా సందర్భాల్లో జగన్ చుట్టూ జనం చూసి చాలామంది మోసపోయారు. జగన్ పై జనాల జాలి అనుకున్నారు. తాజాగా జగన్ తెనాలి పర్యటనలో ఆయన కోసం వచ్చిన జనాన్ని చూసి కూటమి ప్రభుత్వం అలెర్ట్ అవ్వాలట. 

Advertisement
CJ Advs

గతంలో అంటే అధికారంలో ఉండగా ప్రజలను, కార్యకర్తలను పక్కనపెట్టిన జగన్ ను ఇప్పుడు ప్రజలు దేవుడిలా భావించడమే కాదు, జగన్ ప్యాలెస్ నుంచి బయటికొచ్చిన ప్రతిసారి ఆయన కోసం ప్రజలు ఎగబడుతున్నారు, తెనాలిలో జగన్ పర్యటనపై ఎలాంటి విమర్శలైనా రావొచ్చు కానీ, జగన్ కోసం వచ్చిన జనాన్ని చూసి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేఖత ఉందొ అర్ధం చేసుకోమంటుంది బ్లూ మీడియా. 

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. అందుకే జగన్ ని చూడగానే ఆయనపై గతంలో ఉన్న కోపాన్ని కూడా ప్రజలు మర్చిపోయి జగన్ కోసం నిలబడ్డారు.. అంటూ బ్లూ మీడియా ఎచ్చులుపోతుంది. మరి రౌడీ షీటర్ ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ ను ప్రజలు నెత్తిన పెట్టుకోవడం ఏమిటో, అది బ్లూ మీడియాకే తెలియాలి, ఇది మరీ ఆశ్చర్యం అంటూ నెటిజెన్స్ ఎగతాళి చేస్తున్నారు. 

అసలు జగన్ ఓడింది ఎందుకు అధికారంలోకి వచ్చాక జగన్ ఏనాడూ ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోలేదు, కేవలం బటన్ నొక్కుడు ముఖ్యమంత్రిగా మిగిలిపోవడం వలనే కదా అధికారం పోగొట్టుకుంది, కానీ ఇప్పుడు మాత్రం జగన్ చుట్టూ జనం చేరుతున్నారు, జరా జాగ్రత్త, కూటమి ప్రభుత్వంపై ప్రమాద ఘంటికలు మొదలైనాయి అని భయపెడితే భయపడాలా అంటూ టీడీపీ అభిమానులు నవ్వుకుంటున్నారు. 

Jagan Mohan Reddy:

Dalit groups protest against Jagan Reddy visit to Tenali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs